కడప అర్బన్ : పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నపుడే ఆరోగ్యంగా జీవించవచ్చని ఏఆర్ అదనపు ఎస్పీ బి.రమణయ్య పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల మూడవ శనివారం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వర్ణాంధ్ర– స్వచ్చాంధ్ర’ కార్యక్రమాన్ని శనివారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి నీరు పోశారు. పోలీస్ సిబ్బంది ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర’పై ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.


