లైంగిక వేధింపులపై కేసు | - | Sakshi
Sakshi News home page

లైంగిక వేధింపులపై కేసు

May 12 2026 5:30 AM | Updated on May 12 2026 5:30 AM

ఒంటిమిట్ట : మండల కేంద్రమైన ఒంటిమిట్టలో పారిశుధ్య కార్మికురాలైన ఓ మహిళను అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి లైంగిక వేధింపులు చేస్తున్నాడని కేసు నమోదు చేశారు. ఒంటిమిట్ట ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు.. ఏడాది కాలం నుంచి లైంగికంగా, మానసికంగా వేదిస్తున్నాడని బాధితురాలు పిర్యాదు చేసింది.ఈ మేరకు నిందితునిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

నియామకం

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : కాంగ్రెస్‌ పార్టీ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షునిగా దాసరి శ్రీనివాసులు నియమించినట్లు డీసీసీ అధ్యక్షురాలు ఎన్‌డీ విజయజ్యోతి పేర్కొన్నారు. సోమవారం కడపలోని ఇందిరాభవన్‌లో శ్రీనివాసులుకు నియామకపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కడప అసెంబ్లీ కోఆర్డినేటర్‌ బండి జకరయ్య, ఏఐసీసీ కోఆర్డినేటర్‌ అబ్దుల్‌ సత్తార్‌, యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మూరతోటి విజయ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

జమ్మలమడుగు : నిరుపేద రజక విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఆర్థిక సాయం అందించనున్నట్లు, అందుకోసం దరఖాస్తులు చేసుకోవాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బీసీ సెల్‌ ప్రధాన కారదర్శి లక్షుమయ్య పేర్కొన్నారు. సోమవారం స్థానిక తన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 31వ తేదీన నిరుపేదలైన రజక విద్యార్థులకు ఆర్థికం సాయం చేయడంకోసం రజక వేల్పేర్‌ ఆసోషియేషన్‌ తరపున తీర్మానం చేసినట్లు చెప్పారు. పదోతరగతిలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారు 500కంటే ఎక్కువ మార్కులు, అలాగే ఇంటర్మీడియట్‌ ప్రభుత్వ, ప్రైవేట్‌కాలేజీల్లో చదువుకుని అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అత్యధిక మార్కులు సాధించిన వారిని డ్రా తీసి వైఎస్సార్‌సీపీ రజకుల సంఘం రాష్ట్ర వర్కింగ్‌ అధ్యక్షుడు లోగిడి జయన్నతో కలిసి తమ సొంత నిధులు వెచ్చించి ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు చెప్పారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఆరు మండలాల రజక విద్యార్థులు దరఖాస్తులను చేసుకోవాలన్నారు. వివరాలకు 9949669637,9505502212 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు. ఈనెల 28లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

హత్యకేసులో నిందితులు అరెస్టు

లక్కిరెడ్డిపల్లి : మండలంలోని పందిళ్లపల్లి గ్రామం, బీసీ కాలనీకి చెందిన చిన్నక్క హత్యకేసులో తల్లీ, కొడుకులైన సావిత్రి, వేణులను సోమవారం అరెస్టు చేసినట్లు రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్‌ పేర్కొన్నారు. పందిళ్లపల్లి కస్సాలోని పసుపులేటి చిన్నక్క (65) ఒకే బజారులో ఉన్న సావిత్రి, వేణులు ఏప్రిల్‌ 25న ఇంటిముందర గొడవపడ్డారు. తల్లీ కొడుకులు చిన్నక్కను గోడకేసి కొట్టడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. దీంతో ఆమెను లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో కడప రిమ్స్‌కు తీసుకెళ్లారు. చికిత్స చేస్తుండగా ఫిట్స్‌ రావడంతో తిరుపతికి తరలించారు.అక్కడ కూడా పరిస్థితి విషమించడంతో వైద్యులు ఇంటికి తీసుకెళ్లమని చెపారు. దీంతో ఆమెను ఈనెల 7న పందెళ్లపల్లికు తీసుకువచ్చారు.అదేరోజు రాత్రి మృతి చెందింది. సావిత్రి, వేణులు కొట్టిన దెబ్బలకు మా అత్త మృతి చెందినట్లు చిన్నక్క కోడలు రామాంజనమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement