కడప వైఎస్‌ఆర్ సర్కిల్: పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తక్షణము తగ్గించాలని వెంటనే తగ్గించాలని సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి బందెల ఓబయ్య పేర్కొన్నారు. శనివారం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని కోరుతూ కడప రెవిన్యూ డివిజినల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపి, కూటమి ప్రభుత్వం ఒక పథకం ప్రకారం పెట్రోల్, డీజిల్, రేటును పెంచారని తెలిపారు. పార్లమెంటులో తగినంత బలం లేకపోయినా అనేక బిల్లులను దొడ్డిదారిన చెయ్యగలిగిన చరిత్ర వున్న బిజెపి ఆర్థిక మాంద్యం పేరుతో ప్రజల పైన భారాలు మోపడం సరైనది కాదు అని అన్నారు.


