న్యూజిలాండ్‌తో మూడో టీ20.. టాస్‌ గెలిచిన సూర్యకుమార్‌ | team india won the toss and choose to bowl in third T20I vs new zealand | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్‌తో మూడో టీ20.. టాస్‌ గెలిచిన సూర్యకుమార్‌

Jan 25 2026 6:52 PM | Updated on Jan 25 2026 6:54 PM

team india won the toss and choose to bowl in third T20I vs new zealand

గౌహతిలోని బర్సాపరా క్రికెట్‌ స్టేడియంలో న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 25) జరుగనున్న మూడో టీ20లో టీమిండియా టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ కోసం భారత్‌ రెండు మార్పులు చేసింది. అర్షదీప్‌ సింగ్‌, వరుణ్‌ చక్రవర్తి స్థానాల్లో జస్ప్రీత్‌ బుమ్రా, రవి బిష్ణోయ్‌ తుది జట్టులోకి వచ్చారు. 

మరోవైపు న్యూజిలాండ్‌ కూడా ఈ మ్యాచ్‌ కోసం ఓ మార్పు చేసింది. జకరీ ఫౌల్క్స్‌ స్థానంలో కైల్‌ జేమీసన్‌ తుది జట్టులోకి వచ్చాడు. 

కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియా గెలిస్తే, మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్‌ కైవసం చేసుకుంటుంది.

తుది జట్లు..
న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్(w), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), కైల్ జామీసన్, మాట్ హెన్రీ, ఇష్ సోధీ, జాకబ్ డఫీ

భారత్: సంజు శాంసన్(w), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(c), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా

Advertisement
 
Advertisement
Advertisement