
మహిళల వన్డే ప్రపంచకప్‌లో కొలంబో వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లను వరుణుడు వీడటం లేదు. వాన కారణంగా ఇప్పటికే ఇక్కడ మూడు మ్యాచ్‌లు రద్దు కాగా... ఇప్పుడు ఆ జాబితాలో మరో మ్యాచ్ చేరింది. శనివారం కొలంబో వేదికగా పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య జరిగిన పోరు భారీ వర్షం కారణంగా రద్దు అయింది.
దీంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టు సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. ఇప్పటికే ఆ్రస్టేలియా సెమీస్ చేరగా... ఇప్పడు సఫారీ జట్టు రెండో బెర్త్ దక్కించుకుంది. ఇక మిగిలిన రెండు స్థానాలు తేలాల్సి ఉంది. శనివారం పోరులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ జట్టు 25 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది.
ఆలియా రియాజ్ (52 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు), మునీబా అలీ (22; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. లీ తహూహు 2 వికెట్లు పడగొట్టింది. ఈ దశలో మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించగా... సుదీర్ఘ నిరీక్షణ అనంతరం వర్షం కాస్త తెరిపినివ్వగా... మ్యాచ్‌ను 36 ఓవర్లకు కుదించారు. అయితే మరోసారి వర్షం ముంచెత్తడంతో... మ్యాచ్‌ను నిలిపి వేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.
చదవండి: కొంచెం కూడా సిగ్గు లేదు.. జింబాబ్వేను బ్రతిమాలుకున్న పాకిస్తాన్