నేడు న్యూజిలాండ్‌తో భారత్ రెండో టి20
జోరు మీదున్న టీమిండియా
రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియోహాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
రాయ్‌పూర్: న్యూజిలాండ్‌తో తొలి టి20లో ఘన విజయం తర్వాత భారత్ మరో విజయంపై గురి పెట్టింది. గత పోరులో అన్ని రంగాల్లో సమష్టిగా రాణించిన జట్టు 2–0తో ఆధిక్యం అందుకోవాలని భావిస్తోంది. మరో వైపు న్యూజిలాండ్ కోలుకునే ప్రయత్నంలో ఉంది.
ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య నేడు షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో రెండో టి20 మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో ఆటగాళ్ల ప్రదర్శనను బట్టి చూస్తే భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే అక్షర్ పటేల్ గాయం నుంచి కోలుకున్నాడా లేదా అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు.
సామ్సన్, ఇషాన్‌లపై దృష్టి...
తొలి టి20లో భారత బ్యాటర్లలో అభిõÙక్ శర్మ చెలరేగగా, సూర్యకుమార్ కూడా చాలా కాలం తర్వాత చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజ్‌లో ఉన్నంత సేపు పాండ్యా ప్రభావం చూపించగా... ఫినిషర్‌గా రింకూ సింగ్ తన పేరును నిలబెట్టుకున్నాడు.
అయితే సామ్సన్, ఇషాన్ కిషన్ మాత్రమే ప్రభావం చూపలేకపోయారు. గిల్‌ను తప్పించడంతో టి20 టీమ్‌లో ఓపెనర్‌గా తన స్థానం చేసుకున్న సామ్సన్ అంచనాలకు తగినట్లుగా ఆడాల్సి ఉంది. అదే విధంగా వరల్డ్ కప్ టీమ్‌లో కూడా చోటు దక్కించుకున్న ఇషాన్ కిషన్‌పై నమ్మకంతో మేనేజ్‌మెంట్ మూడో స్థానంలో ఆడే అవకాశం కల్పించింది.
ఒక్క మ్యాచ్‌లో వైఫల్యం సమస్య కాకపోయినా... చెత్త షాట్‌లతో వీరు వికెట్లు సమర్పించుకున్నారు. ఈసారి తప్పులు దిద్దుకునే అవకాశం వీరికి ఉంది. పేస్ బౌలింగ్‌లో మరోసారి అర్‡్షదీప్, బుమ్రా ప్రదర్శనపై జట్టు ఆధారపడి ఉండగా, పాండ్యా కూడా కీలక పాత్ర పోషిస్తాడు.
స్పిన్నర్లుగా వరుణ్, అక్షర్ ప్రత్యర్థిపై పైచేయి సాధించగలరు. అయితే తొలి మ్యాచ్‌లో చేతికి గాయంతో బౌలింగ్ నుంచి తప్పుకున్న అక్షర్ ఆడకపోతే మరో స్పిన్నర్ బిష్ణోయ్‌కు చోటు లభించవచ్చు.
తుది జట్టులోకి బ్రేస్‌వెల్!
భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ గత మ్యాచ్‌లో న్యూజిలాండ్ పోరాడినా ఫలితం లేకపోయింది. అయితే ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చి సిరీస్‌ను సమం చేయాలని జట్టు ఆశిస్తోంది. టాప్–3 విఫలం కావడంతో జట్టును దెబ్బ తీసింది. వన్డే సిరీస్‌లో కూడా ఘోరంగా విఫలమైన కాన్వే ఇప్పటికైనా రాణించాలని టీమ్ కోరుకుంటోంది.
రచిన్‌పై కూడా ప్రధాన బాధ్యత ఉండగా, రాబిన్సన్ దూకుడుగా ఆడగల సమర్థుడు. ఫిలిప్స్, చాప్‌మన్ మరోసారి కీలకం కానుండగా, వన్డే ఫామ్‌ను కొనసాగిస్తున్న మిచెల్ ఈ సారైనా జట్టును గెలిపించాలని పట్టుదలగా ఉన్నాడు.
గాయంతో ఆల్‌రౌండర్ బ్రేస్‌వెల్ గత మ్యాచ్‌కు దూరం కావడం కివీస్‌ను బలహీనపర్చింది. అతను కోలుకొని ఈ సారి బరిలోకి దిగే అవకాశం ఉంది. ముగ్గురు పేసర్లలో క్లార్క్‌ను తప్పించి బ్రేస్‌వెల్‌ను ఆడించవచ్చు. ఇతర స్పిన్నర్లు సాంట్నర్, సోధి ఏమాత్రం ప్రభావం చూపిస్తారనేది చూడాలి.
తుది జట్లు (అంచనా)
భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్, సామ్సన్, ఇషాన్ కిషన్, పాండ్యా, దూబే, రింకూ సింగ్, అక్షర్/బిష్ణోయ్, అర్‡్షదీప్, వరుణ్, బుమ్రా.
న్యూజిలాండ్: సాంట్నర్ (కెప్టెన్), కాన్వే, రాబిన్సన్, రచిన్, ఫిలిప్స్, చాప్‌మన్, మిచెల్, క్లార్క్/బ్రేస్‌వెల్, జేమీసన్, సోధి, డఫీ.
పిచ్, వాతావరణం
బ్యాటింగ్‌కు బాగా అనుకూలమైన పిచ్. ఈ మైదానంలో రెండేళ్ల క్రితం జరిగిన ఏకైక టి20లో ఆ్రస్టేలియాపై భారత్ గెలిచింది. మంచు ప్రభావం చాలా ఎక్కువ. కాబట్టి ఛేదన సులువు. ఇటీవల భారత్‌పై వన్డేలో దక్షిణాఫ్రికా 358 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.


