భారత్-న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్ జరుగనుంది. నాగ్‌పూర్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగుతుంది. ఈ మ్యాచ్‌తో క్రిస్టియన్ క్లార్క్ వన్డే అరంగేట్రం చేస్తున్నాడు. మిగతా ఇద్దరు పేసర్లుగా జేమీసన్, డఫీ ఉన్నారు.
మరోవైపు భారత్ ముందుగా చెప్పినట్లుగానే శ్రేయస్‌ను కాదని వన్‌డౌన్‌లో ఇషాన్ కిషన్‌కు అవకాశం ఇచ్చింది. హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్‌లను బెంచ్‌కే పరిమితం చేసింది. కాగా, ఈ సిరీస్‌కు ముందు జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను పర్యాటక న్యూజిలాండ్ 2-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
తుది జట్లు..
న్యూజిలాండ్: టిమ్ రాబిన్సన్, డెవాన్ కాన్వే(w), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), క్రిస్టియన్ క్లార్క్, కైల్ జామిసన్, ఇష్ సోధి, జాకబ్ డఫీ
భారత్: సంజు శాంసన్(w), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(c), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా


