
జింబాబ్వే వేదికగా జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. హరారే వేదికగా శుక్రవారం ఆతిథ్య జింబాబ్వే జట్టును 8 వికెట్ల తేడాతో కివీస్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 120 పరుగులు మాత్రమే చేసింది.
జింబాబ్వే బ్యాటర్లలో మాధేవేరే(36) టాప్ స్కోరర్‌గా నిలవగా.. బెన్నట్(21) పర్వాలేదన్పించాడు. బ్లాక్‌క్యాప్స్ బౌలర్లలో మాట్ హెన్రీ మూడు వికెట్లతో ఆతిథ్య జట్టును దెబ్బతీయగా.. మిల్నే, శాంట్నర్, బ్రెస్‌వేల్, రచిన్ రవీంద్ర తలా వికెట్ సాధించారు.
కాన్వే హాఫ్ సెంచరీ..
అనంతరం 121 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. కివీస్ ఓపెనర్ డెవాన్ కాన్వే(59 నాటౌట్) ఆర్ధశతకంలో మెరవగా.. రచిన్ రవీంద్ర(30), డార్లీ మిచెల్(26 నాటౌట్) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో మాపోసా, ముజర్బానీ తలా వికెట్ సాధించారు. ఈ సిరీస్‌లో భాగంగా జూలై 20న హరారే వేదికగా జింబాబ్వే, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి.
చదవండి: WCL 2025: బరిలో యువీ, డివిలియర్స్, బ్రెట్ లీ.. షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు