మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 18) జరుగునున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కీలకమైన ఈ మ్యాచ్ కోసం భారత జట్టు ఓ మార్పు చేసింది.
తొలి రెండు మ్యాచ్‌ల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ప్రసిద్ద్ కృష్ణ స్థానంలో స్టార్ పేసర్ అర్షదీప్ సింగ్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌ల్లో ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతుంది. కాగా, ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో భారత్, రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలుపొందాయి. మూడో మ్యాచ్‌లో గెలిచే జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది.
తుది జట్లు..
న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(wk), మైఖేల్ బ్రేస్‌వెల్(c), జకారీ ఫౌల్క్స్, కైల్ జామిసన్, క్రిస్టియన్ క్లార్క్, జేడెన్ లెన్నాక్స్
టీమిండియా: రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్(c), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్(wk), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్


