రాజ్‌కోట్ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 14) జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా టాస్ ఓడింది. ప్రత్యర్థి ఆహ్వానం మేరకు భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఓ మార్పుతో బరిలోకి దిగుతుంది.
తొలి వన్డే సందర్భంగా గాయపడిన వాషింగ్టన్ సుందర్ స్థానంలో ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు న్యూజిలాండ్ కూడా ఓ మార్పు చేసింది. ఆ జట్టు తరఫున జేడన్ లెన్నాక్స్ (ఆదిత్య అశోక్ స్థానంలో) అరంగేట్రం చేయనున్నాడు. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ తొలి వన్డే గెలిచి 1-0 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.
తుది జట్లు..
న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(wk), మైఖేల్ బ్రేస్‌వెల్(c), జకారీ ఫౌల్క్స్, జేడెన్ లెన్నాక్స్, కైల్ జామిసన్, క్రిస్టియన్ క్లార్క్
భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్(c), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్(wk), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ


