న్యూజిలాండ్‌తో రెండో టీ20.. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌ | team india won the toss and choose to bowl in second T20I vs new zealand | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్‌తో రెండో టీ20.. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

Jan 23 2026 6:44 PM | Updated on Jan 23 2026 7:20 PM

team india won the toss and choose to bowl in second T20I vs new zealand

రాయ్‌పూర్‌లోని షాహీద్‌ వీర్‌ నారాయణ్‌ సింగ్‌ అంతర్జాతీయ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. 

తొలి టీ20లో గాయపడిన అక్షర్‌ పటేల్‌ స్థానంలో కుల్దీప్‌ యాదవ్‌ తుది జట్టులోకి వచ్చాడు. పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రాకు విశ్రాంతినిచ్చి హర్షిత్‌ రాణాను ప్లేయింగ్‌ ఎలెవెన్‌లో తెచ్చారు. 

మరోవైపు న్యూజిలాండ్‌ మూడు మార్పులు చేసింది. రాబిన్సన్‌ స్థానంలో టిమ్‌ సీఫర్ట్‌.. క్రిస్టియన్‌ క్లార్క్‌ స్థానంలో జకరీ ఫౌల్క్స్‌, జేమీసన్‌ స్థానంలో మ్యాట్‌ హెన్రీ తుది జట్టులో​కి వచ్చారు. 

కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

తుది జట్లు..

న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్(w), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), జకరీ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, ఇష్ సోధీ, జాకబ్ డఫీ

భారత్: సంజు శాంసన్(w), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
 

Advertisement
 
Advertisement
Advertisement