
న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో పార్టీ నేతలు
రాజన్న సంక్షేమ, అభివృద్ధి పాలనను గుర్తుచేసుకున్న ప్రవాసాంధ్రులు
సాక్షి, అమరావతి: సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలతో జనరంజక పాలన అందించిన గొప్ప వ్యక్తి దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని ప్రవాసాంధ్రులు కొనియాడారు. సెప్టెంబర్ 2న ఆయన వర్ధంతి సందర్భంగా న్యూజిలాండ్, ఆ్రస్టేలియాలోని పలు నగరాల్లో ప్రవాసాంధ్రులు ఘన నివాళులర్పించారు. వైఎస్సార్‌సీపీ న్యూజిలాండ్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఆక్లాండ్‌లోని సాండ్రింగ్‌హామ్ కమ్యూనిటీ సెంటర్‌లో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు వైఎస్సార్ చేసిన సేవలను కొనియాడారు.
సంక్షేమాభివృద్ధిలో వైఎస్సార్ ఒక అడుగు ముందుకేస్తే.. ఆయన కుమారుడు వైఎస్ జగన్ నాలుగు అడుగులు ముందుకేసి ప్రజలకు సుపరిపాలన అందించారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆనంద్ ఎద్దుల, సుమంత్ డేగపూడి, కృష్ణారెడ్డి, విజయ్ అల్లా, రాజారెడ్డి, బాలశౌర్య, గీతారెడ్డి, రమేష్ పానాటి, సంకీర్త్ రెడ్డి, రఘునాథ్‌రెడ్డి, సుస్మిత, రేఖ, గౌతమి, సింధు, ప్రియాంక, ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు.
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్‌లో వైఎస్సార్‌సీపీ విక్టోరియా విభాగం ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం
ఆ్రస్టేలియాలో రక్తదాన శిబిరం
డాక్టర్ వైఎస్సార్ ఫౌండేషన్ ఆ్రస్టేలియా విభాగం ఆధ్వర్యంలో ఆడిలైడ్ నగరంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో నాయకులు వంశీ బొంతు, రామ్మోహన్‌రెడ్డి మునగల తదితరులతో పాటు వైఎస్సార్, వైఎస్ జగన్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే మెల్‌బోర్న్ నగరంలో వైఎస్సార్‌సీపీ విక్టోరియా విభాగం ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. నాగార్జున యలగాల, అనిల్ కుమార్ పెడగాడ, హరి చెన్నుపల్లి తదితరులు పాల్గొన్నారు.