
సాక్షి, మెల్బోర్న్: దివంగత మహానేత, మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 16వ వర్ధంతి నేపథ్యంతో ఆస్ట్రేలియా మెల్బోర్న్‌లో వైఎస్సార్‌సీపీ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. భారత కాలమానం ప్రకారం.. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
సంక్షేమం, ప్రజాసేవకు నిలువెత్తు సాక్ష్యం.. వైఎస్సార్ అని ఈ సందర్బంగా సభకు హాజరైన వాళ్లు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా వైఎస్సార్సీపీ విక్టోరియా నాయకులు నాగార్జున యలగాల, అనిల్ కుమార్ పెడగాడ, హరి చెన్నుపల్లి, విష్ణు రెడ్డి వాకమల్ల తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి వైవీ సుబ్బారెడ్డి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.
