అమెరికాలో ఎమ్మెస్‌ టాపర్‌గా తెలుగమ్మాయి | Chavali Sri Kavya From Amalapuram Gets Topper In MS Degree USA | Sakshi
Sakshi News home page

అమెరికాలో ఎమ్మెస్‌ టాపర్‌గా తెలుగమ్మాయి

Jun 16 2025 5:41 PM | Updated on Jun 16 2025 6:39 PM

Chavali Sri Kavya From Amalapuram Gets Topper In MS Degree USA

అమలాపురం టౌన్‌: అమెరికా దేశం వాషింగ్టన్‌ విశ్వ విద్యాలయానికి చెందిన ఫాస్టర్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ నుంచి అమలాపురం అమ్మాయి చావలి శ్రీకావ్య ఎమ్మెస్‌ డిగ్రీలో టాపర్‌గా నిలిచింది. ఆమె కోనసీమ సైన్స్‌ పరిషత్‌ అధ్యక్షుడు డాక్టర్‌ సీవీ సర్వేశ్వరశర్మ మనమరాలు. అమెరికాలోని ఆ స్కూల్‌లో శనివారం జరిగిన కాన్వగేషన్‌లో శ్రీకావ్యకు ఎమ్మెస్‌ డిగ్రీతోపాటు మాస్టర్‌ ఆఫ్‌ సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌ డిగ్రీ ప్రదానం చేశారు. శ్రీకావ్య ఇప్పటికే వివిధ దేశాల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్స్‌ చేసింది.

హైదరాబాద్‌ జేఎన్టీయూ నుంచి ఎంటెక్, స్వీడన్‌ బ్లెకింజ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి టెలీ కమ్యూనికేషన్స్‌ సిస్టమ్‌లో ఎమ్మెస్‌ డిగ్రీ చేసింది. కోచ్‌ కోడ్‌ ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ నుంచి ఎంబీఏ చేసింది. ఈ ఇనిస్టిట్యూట్‌లో శ్రీకావ్య ఆటోమేషన్‌ ఆఫ్‌ క్లౌడ్‌ హాస్టెడ్‌ అప్లికేషన్స్‌ అనే పరిశోధనా పత్రాన్ని సమర్పించింది. ఈమె స్పోర్ట్స్‌లో కూడా విజేతే. జాతీయ స్థాయి ఎయిర్‌ రైఫిల్‌ షూటర్‌గా, తెలంగాణ రాష్ట్రం నుంచి అఖిల భారత పది మీటర్ల మహిళా షూటింగ్‌ చాంపియన్‌ షిప్‌ గెలుచుకుంది.   

మరిన్ని ఎన్‌ఆర్‌ఐ వార్తలకు  ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement