
న్యూజిలాండ్‌లోని ప్రధాన నగరాల్లో కూడా ఆదివారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి జయంతి వేడుకలను ప్రవాస భారతీయులు ఘనంగా నిర్వహించారు. ఆక్లాండ్‌లోని పిక్లింగ్ కన్వెన్షన్ సెంటర్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను వైఎస్సార్‌సీపీ న్యూజిలాండ్ కమిటీ కన్వీనర్ బుజ్జిబాబు నెల్లూరి, కో–కన్వీనర్లు ఆనంద్ ఎద్దుల, డేగపూడి సమంత్, సభ్యులు బాలశౌర్య, రాజారెడ్డి, పిళ్లా పార్థ, జిమ్మి, గీతారెడ్డి, ఆళ్ల విజయ్, రమేష్ పనటి, సంకీర్త్ రెడ్డి ఘనంగా నిర్వహించారు.
భారతదేశం నుండి గౌరవ అతిథులుగా అలూరు సంబ శివ రెడ్డి , ఆరే శ్యామల రెడ్డి, జి. శాంత మూర్తి , నందమూరి లక్ష్మీ పార్వతి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యూజిలాండ్ మాజీ మంత్రి మైకేల్ ఉడ్ హాజయ్యారు. ఎన్నారైలు బీరం బాల, కళ్యాణ్‌రావు, కోడూరి చంద్రశేఖర్, అర్జున్‌రెడ్డి, మల్లెల గోవర్ధన్, జగదీష్ రెడ్డి, ఇందిర సిరిగిరి తదితరులు పాల్గొన్నారు.