
న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో చెలరేగిపోతున్నాడు. వరుస సెంచరీలతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ సీజన్‌తోనే మిడిల్‌సెక్స్‌తో జతకట్టిన కేన్.. అరంగేట్రం మ్యాచ్‌లో సెంచరీ చేసి, తాజాగా రెండో మ్యాచ్‌లోనూ శతకం నమోదు చేశాడు. కేన్ మామకు ఇది ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో 45వ శతకం.
గ్లోసెస్టర్‌షైర్‌తో నిన్న (జులై 29) మొదలైన మ్యాచ్‌లో కేన్ 112 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 104 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. ఇవాళ రెండో రోజు ఆట ప్రారంభం కావాల్సి ఉంది. కేన్ అరంగేట్రం మ్యాచ్‌లో నార్తంప్టన్‌షైర్‌పై 159 బంతుల్లో 14 ఫోర్లు, సిక్సర్ సాయంతో 114 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో మిడిల్‌సెక్స్ ఇన్నింగ్స్ 107 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ప్రస్తుత మ్యాచ్ విషయానికొస్తే.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి మిడిల్‌సెక్స్ 3 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. కేన్‌తో పాటు కెప్టెన్ లూస్ డు ప్లూయ్ (42) క్రీజ్‌లో ఉన్నారు. మిడిల్‌సెక్స్ ఇన్నింగ్స్‌లో జాషువ డి కెయిర్స్ 58, సామ్ రాబ్సన్ 4, మ్యాక్స్ హోల్డన్ 14 పరుగులు చేసి ఔటయ్యారు. గ్లోసెస్టర్‌షైర్ బౌలర్లలో మ్యాట్ టేలర్ 2, బెన్ చార్ల్స్‌వర్త్ ఓ వికెట్ పడగొట్టారు.
కాగా, కేన్ ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు దూరంగా ఉన్నాడు. మిడిల్‌సెక్స్‌తో ఉన్న కమిట్‌మెంట్స్ కారణంగా జాతీయ జట్టుకు అందుబాటులో లేడు. న్యూజిలాండ్ జట్టు ప్రస్తుతం జింబాబ్వేలో పర్యటస్తుంది. ఈ పర్యటనలో కోసం ఎంపిక చేసిన జట్టు నుంచి కేన్ స్వచ్చందంగా తప్పుకున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో కేన్ న్యూజిలాండ్ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను తిరస్కరించాడు. ప్రైవేట్ లీగ్‌లకు అందుబాటులో ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడు.