రాయ్‌పూర్‌లోని షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి టీమిండియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది.
న్యూజిలాండ్ ఈ స్కోర్ చేసేందుకు ప్రతి ఒక్కరి దోహదపడ్డారు. రచిన్ రవీంద్ర (44), కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (47 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లతో సత్తా చాటారు.
కాన్వే (19), సీఫర్ట్ (24), ఫిలిప్స్ (19), డారిల్ మిచెల్ (18), మార్క్ చాప్‌మన్ (10), జకరీ ఫౌల్క్స్ (15 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నంతసేపు బ్యాట్ ఝులిపించారు. ఆఖర్లో సాంట్నర్, ఫౌల్క్స్ క్యామియో న్యూజిలాండ్‌ను 200 పరుగుల మార్కును దాటించింది.
భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 2, హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో అర్షదీప్ సింగ్ (4-0-53-0) భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.
రెండు మార్పులతో బరిలోకి దిగిన టీమిండియా
ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. తొలి టీ20లో గాయపడిన అక్షర్ పటేల్ స్థానంలో కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చాడు. పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చి హర్షిత్ రాణాను ప్లేయింగ్ ఎలెవెన్‌లో తెచ్చారు.
మరోవైపు న్యూజిలాండ్ మూడు మార్పులు చేసింది. రాబిన్సన్ స్థానంలో టిమ్ సీఫర్ట్.. క్రిస్టియన్ క్లార్క్ స్థానంలో జకరీ ఫౌల్క్స్, జేమీసన్ స్థానంలో మ్యాట్ హెన్రీ తుది జట్టులోకి వచ్చారు.
కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
తుది జట్లు..
న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్(w), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), జకరీ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, ఇష్ సోధీ, జాకబ్ డఫీ
భారత్: సంజు శాంసన్(w), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి


