టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ ఆరంభ మ్యాచ్‌లోనే టీమిండియా బ్యాటర్లు కఠిన పరీక్ష ఎదుర్కొన్నారు. ముంబై వేదికగా అమెరికా బౌలర్లు ఆది నుంచే చెలరేగుతూ భారత బ్యాటింగ్ విభాగంపై ఒత్తిడి పెంచారు. రెండో ఓవర్ రెండో బంతికే అలీ ఖాన్ అభిషేక్ శర్మ (0) డకౌట్‌గా వెనక్కి పంపాడు.
ఒకే ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయి..
ఆ తర్వాత వాన్ షాల్‌విక్ ఆరో ఓవర్లో రెండో బంతికి ఇషాన్ కిషన్ (20), ఐదో బంతికి తిలక్ వర్మ (25), ఆఖరి బంతికి శివం దూబే (0)ను అవుట్ చేసి.. భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను కుదేలు చేశాడు. ఫలితంగా పవర్ ప్లేలో కేవలం 44 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది టీమిండియా.
సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ ఇన్నింగ్స్
మిగిలిన వారిలో రింకూ సింగ్ (6), హార్దిక్ పాండ్యా (5) ఎక్కువ సేపు నిలవలేకపోయారు. వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ కాసేపు అలరించి (11 బంతుల్లో 14) పెవిలియన్ చేరాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు.
A fine innings from the man in top form! 👏@surya_14kumar brings up his 25th T20I fifty, just when the team needed it the most! 💙
PS. India win 88% of matches when captain SKY scores 50+
ICC Men’s #T20WorldCup | #INDvUSA | LIVE NOW 👉 https://t.co/GSioxLqv9R pic.twitter.com/GQYypRHKDJ— Star Sports (@StarSportsIndia) February 7, 2026
మెరుపు అర్ధ శతకం
ధనాధన్ దంచికొట్టిన సూర్య 36 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక సూర్య మెరుపు అర్ధ శతకం కారణంగా టీమిండియా మెరుగైన స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.
అమెరికా బౌలర్లలో వాన్ షాల్‌విక్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. హర్మీత్ సింగ్ రెండు, అలీ ఖాన్, మొహమ్మద్ మొహ్సిన్ చెరో వికెట్ పడగొట్టారు. కాగా గ్రూప్-‘ఎ’లో
చదవండి: అప్పటిదాకా బిగ్ క్రికెటర్ అని ఒప్పుకోను: వైభవ్ సూర్యవంశీ తండ్రి


