ఆసుపత్రిపాలైన సర్ఫరాజ్‌ ఖాన్‌ | Big Blow For Mumbai Ahead Of The Ranji Trophy Quarter Final Against Karnataka As Sarfaraz Khan Has Been Hospitalised With A Viral Fever | Sakshi
Sakshi News home page

ఆసుపత్రిపాలైన సర్ఫరాజ్‌ ఖాన్‌

Feb 5 2026 12:09 PM | Updated on Feb 5 2026 12:39 PM

Big blow for Mumbai ahead of the Ranji Trophy quarter final against Karnataka as Sarfaraz Khan has been hospitalised with a viral fever

ఫిబ్రవరి 6 నుంచి కార్ణటకతో జరుగబోయే రంజీ ట్రోఫీ 2025-26 నాలుగో క్వార్టర్‌ ఫైనల్‌కు ముందు ముంబై జట్టుకు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు కీలక ఆటగాడు, ఇన్‌ఫామ్ బ్యాటర్‌ సర్ఫరాజ్ ఖాన్ వైరల్‌ ఫీవర్‌ కారణంగా ఆసుపత్రిపాలయ్యాడు. వైద్యులు అతనికి అత్యవసర చికిత్సనందిస్తున్నారు. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం సర్ఫరాజ్‌ మ్యాచ్‌ సమయానికి అందుబాటులో ఉండకపోవచ్చు.

సర్ఫరాజ్‌ ఢిల్లీతో జరిగిన చివరి మ్యాచ్‌ నుంచే ఇబ్బందిపడుతున్నాడు. ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేయగలిగినా ఫీల్డింగ్‌కు రాలేదు. ఆ సమయంలో అతన్ని హామ్‌స్ట్రింగ్ సమస్య కూడా ఇబ్బంది పెట్టింది. అయినా అతను మొదటి ఇన్నింగ్స్‌లో 27 బంతుల్లో 24 పరుగులు చేయగలిగాడు.

క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో సర్ఫరాజ్‌ లేని లోటు ముంబైకు తీవ్రంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇటీవలికాలంలో అతను అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. లీగ్ దశలో హైదరాబాద్‌పై 227 పరుగులు (219 బంతులు) చేసి తన శక్తివంతమైన బ్యాటింగ్‌ను మరోసారి నిరూపించారు. ఆ ఇన్నింగ్స్‌లో అతను 5,000 ఫస్ట్‌క్లాస్ పరుగులు పూర్తి చేశాడు. దీనికి ముందు వైట్ బాల్ క్రికెట్‌లోనూ సర్ఫరాజ్‌ చెలరేగిపోయాడు.విధ్వంసకర బ్యాటింగ్‌తో ఫార్మాట్లకతీతంగా సెంచరీలు నమోదు చేశాడు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement