న్యూజిలాండ్‌ ఆటగాడిపై బ్యాల్‌ టాంపరింగ్‌ ఆరోపణలు

New Zealand Test Player Henry Nicholls Likely To Face Ball Tampering Charge - Sakshi

న్యూజిలాండ్‌ బ్యాటర్‌ హెన్రీ నికోల్స్‌ బాల్‌ టాంపరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. కొద్ది రోజుల కిందట జరిగిన దేశవాలీ క్రికెట్‌ మ్యాచ్‌లో నికోల్స్‌ బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడినట్లు ఆ మ్యాచ్‌ ఫీల్డ్‌ అంపైర్లు ఆరోపించారు. నికోల్స్ న్యూజిలాండ్ క్రికెట్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు వారు అభియోగాలు మోపారు. ఈ విషయంపై నికోల్స్‌ విచారణకు హాజరుకావాల్సి ఉంటుంది. 

ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫో నివేదిక ప్రకారం.. న్యూజిలాండ్‌ దేశవాలీ టోర్నీ అయిన ప్లంకెట్ షీల్డ్ టోర్నీలో భాగంగా క్యాంటర్బరీ, ఆక్లాండ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ సందర్భంగా నికోల్స్ హెల్మెట్‌తో బంతిని రుద్దినట్లు అంపైర్లు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై అంపైర్లు న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డుకు ఫిర్యాదు చేశారు. ఒకవేళ న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు నికోల్స్‌ను దోషిగా తేలిస్తే, అతను కొంతకాలం పాటు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడకుండా నిషేధం ఎదుర్కోవచ్చు. 

ఈ నెలాఖరులో జరిగే బంగ్లాదేశ్ పర్యటనలో నికోల్స్ న్యూజిలాండ్ టెస్టు జట్టులో చేరనున్న నేపథ్యంలో బాల్‌ టాంపరింగ్‌ ఆరోపణలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా, 31 ఏళ్ల నికోల్స్‌ న్యూజిలాండ్‌ టెస్ట్‌ జట్టులో రెగ్యులర్‌ సభ్యుడిగా ఉన్నాడు. అతను ఇప్పటివరకు 54 టెస్టులతో పాటు 72 వన్డేలు, 10 టీ20లు ఆడాడు. తన కెరీర్‌లో నికోల్స్‌ ఓవరాల్‌గా 5000 పైచిలుకు పరుగులు సాధించాడు. ఇందులో 10 సెంచరీలు, 26 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top