బాల్‌ ట్యాంపరింగ్‌: ఐపీఎల్‌ను తాకిన సెగలు! | ball tampering, Steve Smith may not be captain in IPL also | Sakshi
Sakshi News home page

Mar 25 2018 4:05 PM | Updated on Mar 25 2018 4:05 PM

ball tampering, Steve Smith may not be captain in IPL also - Sakshi

న్యూఢిల్లీ : యావత్‌ క్రికెట్‌ ప్రపంచాన్ని నివ్వెరబోయేలా చేసిన ఆసీస్‌ క్రికెటర్ల బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదం సెగలు తాజాగా ఐపీఎల్‌ను తాకాయి. దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు సందర్భంగా ఆస్ట్రేలియా ఆటగాడు కామెరాన్‌ బెన్‌క్రాఫ్ట్‌ బాల్‌ ట్యాంపరింగ్‌కు ప్రయత్నించడం తీవ్ర దుమారం రేపుతోంది. ఇలా బాల్‌ ట్యాంపరింగ్‌కు పూనుకోమని తానే చెప్పానని, ఇదంతా తమ సామూహిక పాపమేనని స్మిత్‌ అంగీకరించడం ఆసీస్‌ క్రికెట్‌లో ప్రకంపనలు రేపుతోంది. ఈ వివాదం నేపథ్యంలో ఆస్ట్రేలియా కెప్టెన్‌గా స్టీవ్‌ స్మిత్‌, వైస్‌ కెప్టెన్‌గా డేవిడ్‌ వార్నర్‌ తప్పుకున్నారు.

దేశీయంగా జరిగే టీ20 క్రీడా ఉత్సవం ఐపీఎల్‌ను కూడా ఈ వివాదం ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత ఐపీఎల్‌ ఎడిషన్‌లో రాజస్థాన్‌ జట్టుకు స్టీవ్‌ స్మిత్‌ సారథిగా వ్యవహరించాల్సి ఉంది. అయితే, తాజా వివాదం నేపథ్యంలో అతన్ని రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు సారథిగా కొనసాగించాలా? వద్దా? అన్నది తెలియక జట్టు యాజమాన్యం అయోమయంలో పడింది. ఈ వివాదంలో తదుపరి పరిణామాలను బట్టి ఐపీఎల్‌లోనూ స్మిత్‌ ను జట్టు సారథిగా తొలగించేదిశగా నిర్ణయం తీసుకోవచ్చునని తెలుస్తోంది. బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంతో స్మిత్‌ క్రీడా భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement