బాల్‌ ట్యాంపరింగ్‌ కథనాలపై కోహ్లీ మండిపాటు | Virat Kohli reaction on ball tampering allegations | Sakshi
Sakshi News home page

బాల్‌ ట్యాంపరింగ్‌ కథనాలపై కోహ్లీ మండిపాటు

Nov 25 2016 1:35 PM | Updated on Sep 4 2017 9:06 PM

బాల్‌ ట్యాంపరింగ్‌ కథనాలపై కోహ్లీ మండిపాటు

బాల్‌ ట్యాంపరింగ్‌ కథనాలపై కోహ్లీ మండిపాటు

తనపై వచ్చిన బాల్‌ ట్యాంపరింగ్‌ ఆరోపణలపై టీమిండియా టెస్ట్‌ కెప్టెన్ విరాట్‌ కోహ్లీ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు.

మొహాలీ: తనపై వచ్చిన బాల్‌ ట్యాంపరింగ్‌ ఆరోపణలపై టీమిండియా టెస్ట్‌ కెప్టెన్ విరాట్‌ కోహ్లీ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. ఇండియా- ఇంగ్లాండ్‌ క్రికెట్‌ సిరీస్‌పై దృష్టి మళ్లించేందుకే ఇలాంటి అర్థంలేని ఆరోపణలు తెరపైకి తెస్తున్నారని ఆరోపించాడు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో భాగంగా మూడో టెస్టు మ్యాచ్‌ కోసం మొహాలీ వచ్చిన కోహ్లీ.. శుక్రవారం మీడియాతో మాట్లాడారు.

‘నిజానికి నాకు న్యూస్‌ పేపర్లు చదివే అలవాటులేదు. రాజ్‌కోట్‌(మొదటి) టెస్ట్‌లో నేను బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డానని ఒక పేపర్‌లో వచ్చిన సంగతి నాకు ఐదు రోజుల కిందటే తెలిసింది. ఆ విషయం తెలిసి మొదట నవ్వుకున్నా. విచక్షణతో ఆలోచిస్తే.. హోరాహోరీగా సాగుతోన్న ఇండియా-ఇంగ్లాండ్‌ సిరీస్‌పై దృష్టి మరల్చేందుకే ఇలాంటి కథనాల్ని పుట్టించారని అర్థం అవుతుంది’అని కోహ్లీ మీడియాతో అన్నారు. న్యూస్‌ పేపర్లో కథనం ఆధారంగా ఇంటర్నేషనల్ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) తనపై చర్యలకు ఉపక్రమించబోదని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement