డుప్లెసిస్ ‘తప్పు’ చేశాడు! | Duplesis 'wrong' did that | Sakshi
Sakshi News home page

డుప్లెసిస్ ‘తప్పు’ చేశాడు!

Nov 22 2016 11:47 PM | Updated on Sep 4 2017 8:49 PM

డుప్లెసిస్ ‘తప్పు’ చేశాడు!

డుప్లెసిస్ ‘తప్పు’ చేశాడు!

దక్షిణాఫ్రికా టెస్టు జట్టు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లుగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్ధారించింది.

ధ్రువీకరించిన ఐసీసీ  నిషేధం లేదు, జరిమానాతో సరి

అడిలైడ్: దక్షిణాఫ్రికా టెస్టు జట్టు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లుగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్ధారించింది. ఇందుకు అతని మ్యాచ్ ఫీజులో 100 శాతం జరిమానాగా విధించింది. అరుుతే మ్యాచ్ నిషేధం నుంచి మాత్రం డు ప్లెసిస్ తప్పించుకున్నాడు. ఫలితంగా గురువారం నుంచి జరిగే మూడో టెస్టులో అతను ఆడనున్నాడు. ఆస్ట్రేలియాతో హోబర్డ్‌లో జరిగిన రెండో టెస్టులో ట్యాంపరింగ్ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ముందు డు ప్లెసిస్ సుదీర్ఘ విచారణకు హాజరయ్యాడు. తాను తప్పు చేయలేదని అతను వాదించాడు. అనంతరం ఐసీసీ తమ నిర్ణయాన్ని ప్రకటించింది. ‘తన నోటిలో ఉన్న చాక్లెట్ లేదా మింట్‌లాంటి పదార్థంతో డు ప్లెసిస్ బంతి స్వరూపాన్ని మార్చేందుకు ప్రయత్నించినట్లు టీవీ ఫుటేజీలో కనిపించింది. అంపైర్లతో చర్చించిన తర్వాతే ఈ చర్య తీసుకుంటున్నాం.

వారు కూడా తగిన సాక్ష్యాలు అందించారు. ఐసీసీ నిబంధన 2.2.9 ప్రకారం కృత్రిమ వస్తువులు వాడి బంతి ఆకారాన్ని దెబ్బ తీయడం నిబంధనలను ఉల్లంఘించినట్లుగా భావిస్తున్నాం’ అని ఐసీసీ ప్రకటించింది. దీనిని మొదటి తప్పుగా భావించి వంద శాతం జరిమానా విధించిన ఐసీసీ, దాంతో పాటు ప్లెసిస్ క్రమశిక్షణా రికార్డులో మూడు పారుుంట్లు తగ్గించింది. అరుుతే ఐసీసీ శిక్షపై డు ప్లెసిస్ మరోసారి అప్పీల్‌కు వెళ్లాలని భావిస్తున్నాడు. 2013లోనూ పాకిస్తాన్‌తో జరిగిన టెస్టులో డు ప్లెసిస్ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడి 50 శాతం మ్యాచ్ ఫీజు జరిమానాగా చెల్లించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement