వార్నర్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌.. త్వరలోనే కెప్టెన్సీపై జీవిత కాల నిషేధం ఎత్తివేత..!

Cricket Australia Likely To Lift The Lifetime Leadership Ban Of David Warner - Sakshi

నాలుగేళ్ల కిందట జరిగిన బాల్‌ టాంపరింగ్‌ వివాదం క్రికెట్‌ ఆస్ట్రేలియాను ఓ కుదుపు కుదిపిన సంగతి తెలిసిందే. 2018లో దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు సందర్భంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు బాల్ ట్యాంపరింగ్ పాల్పడ్డారు. ఈ ఘటన జరగిన సమయంలో అప్పటి కెప్టెన్‌ స్టీవ్ స్మిత్‌, వైస్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌, కామెరూన్‌ బెన్‌ క్రాఫ్ట్‌పై క్రికెట్‌ ఆస్ట్రేలియా ఏడాది కాలం పాటు నిషేదం విధించింది.

ఇక నిషేధం ముగిసిన ఏడాది వరకు స్మిత్‌ను కెప్టెన్సీకి అనర్హుడిగా ప్రకటించారు. అదే విధంగా డేవిడ్‌ వార్నర్‌ కెప్టెన్సీపై క్రికెట్‌ ఆస్ట్రేలియా జీవిత కాల నిషేదం విధించింది. అయితే తాజా పరిణామాల ప్రకారం.. వార్నర్‌ కెప్టెన్సీపై  జీవిత కాల నిషేదం ఎత్తి వేసే యోచనలో క్రికెట్‌ ఆస్ట్రేలియా ఉన్నట్లు తెలుస్తోంది.

ఆస్ట్రేలియాకు బెన్ హార్న్ న్యూస్‌ ఏజెన్సీ నివేదిక ప్రకారం.. 2018 బాల్‌ టాంపరింగ్‌ వివాదం నేపథ్యంలో వార్నర్‌పై విధించిన కెప్టెన్సీ నిషేదాన్ని  క్రికెట్‌ ఆస్ట్రేలియా పునః పరిశీలిస్తుంది. ఈ నిషేదంతో టీ20 లీగ్‌లలో వార్నర్‌ తన కెప్టెన్సీ అవకాశాలు కోల్పోతున్నాడని ఆ దేశ క్రికెట్‌ బోర్డు భావిస్తోంది. ముఖ్యంగా ఆ దేశ మేజర్‌ టోర్నీ బిగ్‌బాష్‌ లీగ్‌లో కూడా కేవలం ఆటగాడిగానే వార్నర్‌ కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో అతడిపై నిషేదం ఎత్తి వేయనున్నట్లు సమాచారం.
చదవండి: IND-W Vs SL-W: రాణించిన షఫాలీ, రోడ్రిగ్స్.. శ్రీలంకపై భారత్‌ ఘనవిజయం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top