ప్రపంచం మీ ఏడుపును కోరుకుంది: అశ్విన్‌ | R Ashwin  Says World Simply Wants To See You Cry  | Sakshi
Sakshi News home page

Mar 30 2018 3:30 PM | Updated on Mar 30 2018 3:34 PM

R Ashwin  Says World Simply Wants To See You Cry  - Sakshi

స్టీవ్‌ స్మిత్‌

సాక్షి, హైదరాబాద్‌ : ట్యాంపరింగ్‌ వివాదంతో తమ తప్పును అంగీకరిస్తూ కన్నీళ్లు పెట్టుకున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లపై టీమిండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తన సానుభూతిని వ్యక్తం చేశాడు. ‘ప్రపంచం మీ ఏడుపును కోరుకుంది. మీరు ఏడ్చారు కదా! ఇక వారంతా సంతృప్తి చెందారు. ప్రశాంతంగా జీవిస్తారు. ఈ ఘటన నుంచి బయటపడే శక్తిని ఆ దేవుడు మీకివ్వాలి (స్మిత్‌, బెన్‌ క్రాప్ట్‌, డెవిడ్‌ వార్నర్‌)’ అని ట్వీట్‌ చేశాడు. 

ఇక మరో ట్వీట్‌లో ‘వార్నర్‌కు ఈ ఘటనను ఎదర్కునే శక్తి కావాలి. వారి దేశ ఆటగాళ్ల యూనియన్‌ నుంచి అతనికి మద్దతు లభిస్తోందని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నాడు.  ఇక ట్యాంపరింగ్‌ ఘటనపై తమ తప్పును అంగీకరిస్తూ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌, బాన్‌ క్రాఫ్ట్‌, డేవిడ్‌ వార్నర్‌లు పశ్చాతాపం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.  ఈ సందర్భంగా వారు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.  మరో వైపు  జట్టు హెడ్‌ కోచ్‌ డారెన్‌ లీమన్‌ కోచ్‌ పదవికి కూడా రాజీనామా చేసాడు. 

కన్నీళ్లు పెట్టుకున్న ఆటగాళ్లపై మాజీ క్రికెటర్లు, అభిమానులు సైతం సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.  శిక్షల తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉందని అభిప్రాయ పడుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement