
సాక్షి, జొహన్నెస్‌బర్గ్ : ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్‌కు చేదు అనుభం ఎదురైంది. బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలతో స్వదేశానికి బయలుదేరిన అతన్ని జొహన్నెస్‌బర్గ్ ఎయిర్‌పోర్టులో కొందరు చుట్టు ముట్టారు. ఛీట్.. ఛీట్.. అంటూ నినాదాలు చేశారు. వెంటనే భద్రతా సిబ్బంది స్మిత్‌ను లోపలికి తీసుకెళ్లారు.
అదే సమయంలో మీడియా స్మిత్‌ను ముట్టడించి ప్రశ్నల వర్షం గుప్పించింది. అయినప్పటికీ అతనేం స్పందించపోగా.. అధికారులు అతన్ని వేగంగా తీసుకెళ్లారు. ఇక గురువారం సాయంత్రం సిడ్నీలో స్మిత్ విలేకరుల సమావేశంలో మాట్లాడనున్నాడు. ట్యాంపరింగ్‌పై విలేకరుల నుంచి ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కొంటాడో... వాటికి ఎలా స్పందిస్తాడో చూడాలి.
కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్ బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన క్రికెట్ ఆస్ర్టేలియా(సీఏ) స్మిత్, వార్నర్‌పై ఏడాది నిషేధం, మరో ఆటగాడు బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలల నిషేధం విధించింది.