బాల్ ట్యాంపరింగ్ ఉదంతంలో ఆసీస్ ఆటగాళ్లపై సొంత బోర్డే ఆగ్రహం వ్యక్తం చేసింది. అసాధారణ చర్యకు పాల్పడటమేకాక, అది జట్టు సమష్టి నిర్ణయమని నిస్సిగ్గుగా చెప్పుకున్న స్టీవ్ స్మిత్, కామెరాన్ బెన్‌క్రాఫ్ట్‌లను చూసి క్రీడాభిమానులు నివ్వెరపోతున్నారని, ఒక విధంగా దేశం అప్రతిష్టపాలైందని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) సీఈవో జేమ్స్ సదర్లాండ్ అన్నారు. ట్యాంపరింగ్ ఘటనను బోర్డు తీవ్రంగా పరిగణిస్తున్నదని, తక్షణమే విచారణకు ఆదేశించామని, ఈ మేరకు ఇద్దరు నిపుణుల బృందం ఇప్పటికే కేప్‌టౌన్‌కు బయలుదేరిందని తెలిపారు