అంతర్జాతీయ అస్థిరపరిస్థితుల నేపథ్యంలో ఇది తక్షణావసరం
రక్షణ రంగంలో సహకారం పెరగాలి
టోక్యోలో జరిగిన 2+2 భేటీలో జై శంకర్, రాజ్‌నాథ్ స్పషీ్టకరణ
స్వార్థ ప్రయోజనాల కోసం వనరులను వాడుకోవడం ఆందోళకరమని వ్యాఖ్య
టోక్యో: అనుసంధానత, వనరులు, సప్లయ్ చైన్‌లను స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకునే ధోరణులు ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోవడంపై విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా కొనసాగుతున్న అస్థిర పరిస్థితుల నడుమ భారత్–జపాన్ మధ్య సంబంధాలు మరింతగా బలపడాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు. రక్షణ రంగంలో, ముఖ్యంగా సముద్ర ప్రాంత భద్రత, క్షిపణి సాంకేతికతల్లో మరింతగా సహకరించుకునేందుకు రెండు దేశాల మధ్య అంగీకారం కుదిరిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.
గురువారం జపాన్ రాజధాని టోక్యోలో ఇరు దేశాల విదేశాంగ, రక్షణ మంత్రుల మధ్య జరిగిన నాలుగో 2+2 సమావేశంలో వీరిద్దరూ ప్రసంగించారు. ఈ సందర్భంగా జై శంకర్ జపాన్ విదేశాంగ మంత్రి తొషిమిట్సు మొటెగితో, రాజ్‌నాథ్ జపాన్ రక్షణ మంత్రి షిన్జిరో కొయిజుమితో సమావేశమై ద్వైపాక్షక సంబంధాలపై చర్చలు జరిపారు. అనంతరం జై శంకర్, రాజ్‌నాథ్ మీడియాతో మాట్లాడారు. కోవిడ్ మహమ్మారితో సృష్టించిన అల్లకల్లోలం నుంచి ప్రపంచం తేరుకోకమునుపే రష్యా–ఉక్రెయిన్, పశి్చమాసియా సంక్షోభాలు వచ్చిపడ్డాయి.
వీటి ప్రభావం సమీప దేశాలతోపాటు సుదూర ప్రాంతాలపైనా తీవ్ర ప్రభావం చూపాయి. ఆర్థిక వ్యవస్థలు ఒడుదొడులకు లోనయ్యాయి. ప్రపంచ ఇంధన మార్కెట్లు, నౌకాయానం, ఆహార భద్రతపై ప్రతికూల ప్రభావం పడింది. వీటన్నిటిని నుంచి కాపాడుకునేందుకు మన మధ్య ఉన్న విశ్వసనీయమైన, బలమైన భాగస్వామ్యాలు ఎంతో కీలకంగా మారాయి’అని ఆయన పేర్కొన్నారు. మందుపాతరల గుర్తింపు, వెలికితీత అంశాల్లోనూ సహకారాన్ని విస్తృతం చేసుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
ఇండో–పసిఫిక్ ప్రాంతంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా చేసేందుకు రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయన్నారు. ఈ విషయంలో ఇతర క్వాడ్ భాగస్వాములు కూడా ఇది అభిప్రాయంతో ఉన్నాయని జై శంకర్ వివరించారు. కనెక్టివిటీ, వనరులు, సేవలు, సరఫరా గొలుసులు, మార్కెట్ అనుకూలతలను ఆయుధాలుగా మార్చుకునే ధోరణి పెరుగుతుండటంపైనా తాము చర్చించామన్నారు. ఇందులో చాలా అంశాలు జాతీయ భద్రతపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతున్నాయని తెలిపారు. వీటిని ప్రభావవంతంగా ఎదుర్కొనేందుకు కొత్త అవకాశాలను అన్వేíÙంచాల్సిన అవసరం చాలా ఉందని స్పష్టం చేశారు.
దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు
భారత్–జపాన్‌ల మధ్య దౌత్య సంబంధాలకు 75 ఏళ్లవుతున్న సందర్భంగా 2027లో జరిగే వేడుకలకు గాను గురువారం ప్రత్యేక లోగోను ఆవిష్కరించారు. భారత్, జపాన్ విదేశాంగ మంత్రులు జై శంకర్, తొషిమిట్సు మొటెగిలు ‘ఇండియా–జపాన్ ఇయర్ ఆఫ్ షేర్డ్ హారిజన్స్’ఇతివృత్తంతో కూడిన ఈ లోగోను విడుదల చేశారు. ఇందులోని ’7’ అంకెలో భారతీయ అలంకార నమూనా, ’5’ అంకెలో సంప్రదాయ సెయిగైహా అలలపై ఉదయిస్తున్న సూర్యుని చిత్రం ఉంటుంది.
బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ విద్యార్థి అఖిల్ క్లియటస్ ఈ లోగోను రూపొందించారు. ఈ ఏడాది ఆగస్టు 17– సెప్టెంబర్ 15 మధ్య లోగో డిజైన్ కోసం భారత్, జపాన్ ప్రభుత్వాలు ప్రజల నుంచి ఎంట్రీలను ఆహ్వానించాయి. 850కిపైగా ఎంట్రీలు రాగా, రెండు ప్రభుత్వాల ప్రతినిధులతో కూడిన కమిటీ ఈ డిజైన్‌ను ఎంపిక చేసింది.
ఒప్పందాల సత్వర అమలుపై దృష్టి: రాజ్‌నాథ్
ప్రత్యేకంగా జలాంతర్గామి, క్షిపణి సాంకేతికత రంగంలో సహకారాన్ని వేగవంతం చేసేందుకు భారత్, జపాన్‌లు అంగీకారానికి వచి్చనట్లు రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. ఇప్పటికే కుదిరిన ఒప్పందాల అమలు తీరు సంతృప్తికరంగా ఉందని తెలిపారు. సముద్ర భద్రతా సహకారానికి సంబంధించి ఇటీవల సంతకం చేసిన మెమోరాండం ఆఫ్ అరేంజ్‌మెంట్‌ను ఆచరణలోకి తెచ్చేందుకు చర్యలను వేగవంతం చేయాలని ఇరుపక్షాలు నిర్ణయించామని వివరించారు.
ఇందులో సముద్ర, వైమానిక రంగాల్లో అవగాహన, అన్వేషణ, సహాయక చర్యలు, సమాచార మారి్పడి ఏర్పాటు వంటి అంశాలు ఉన్నాయని రాజ్‌నాథ్ చెప్పారు. భారత యుద్ధనౌకల కోసం ఇంటిగ్రేటెడ్ యాంటెన్నా మాస్ట్‌లను కలిసి అభివృద్ధి చేసుకునేందుకు ఉద్దేశించిన ఒప్పందాలను త్వరగా పూర్తి చేయాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపామని చెప్పారు. నౌకల మరమ్మతు సౌకర్యాలను పరస్పరం అందుబాటులోకి ఉంచుకునేందుకు మారిటైమ్ షిప్ రిపేర్ అరేంజ్‌మెంట్‌ను త్వరగా ఖరారు చేయాలని కూడా అంగీకరించామని తెలిపారు.


