న్యూఢిల్లీ: డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)డిప్యూటీ డైరెక్టర్ సుశీల్ కుమార్ గర్గ్‌ను ఆదివారం సీబీఐ అరెస్ట్ చేసింది. ఓ ప్రైవేట్ కంపెనీ నిర్వహించే విమానం సరైన స్థితిలోనే ఉందంటూ సర్టిఫికెట్ ఇచ్చేందుకు ఆయన రూ.2.5 లక్షలు లంచం తీసుకుంటుండగా చెన్నైలోని కార్యాలయంలో పట్టుకున్నట్లు సీబీఐ తెలిపింది. లంచం ఇచ్చినందుకు ఈక్వి ఎయిర్ ట్రెయినింగ్ ఆర్గనైజేషన్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ సచిన్ కేశవ్ భానెకు కూడా అదుపులోకి తీసుకుంది.


