ఇంగ్లండ్ చేతిలో ఘోర ఓట‌మి.. పాక్ కెప్టెన్‌పై వేటు? | Shan Masood to be sacked as Pakistan Test captain after England series: Reports | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్ చేతిలో ఘోర ఓట‌మి.. పాక్ కెప్టెన్‌పై వేటు?

Oct 12 2024 8:16 AM | Updated on Oct 12 2024 9:21 AM

Shan Masood to be sacked as Pakistan Test captain after England series: Reports

టెస్టు క్రికెట్‌లో పాకిస్తాన్ దారుణ ప్ర‌ద‌ర్శ‌న కొన‌సాగుతోంది. స్వ‌దేశంలో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన పాకిస్తాన్‌.. ఇప్పుడు ఇంగ్లండ్ సిరీస్‌లోనూ అదే తీరును క‌న‌బ‌రుస్తోంది. ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జ‌రిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 47 ప‌రుగుల తేడాతో పాక్ ఘోర ఓట‌మి చవిచూసింది.

తొలి ఇన్నింగ్స్‌లో 550కు పైగా ప‌రుగులు చేసి ఆ మ్యాచ్‌లో ఓడిపోయిన మొద‌టి జ‌ట్టు పాకిస్తాన్ చెత్త రికార్డును మూట‌కట్టుకుంది. మొద‌టి ఇన్నింగ్స్‌లో 556 ప‌రుగులు చేసిన పాక్ జ‌ట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 220 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. అటు ఇంగ్లండ్ త‌మ మొద‌టి ఇన్నింగ్స్‌లో 823 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది.

మ‌సూద్‌పై వేటు..
కాగా గ‌త‌ 40 నెల‌ల‌గా పాకిస్తాన్ క‌నీసం ఒక్క టెస్టు మ్యాచ్‌లో కూడా గెల‌వ‌లేదు. చివ‌ర‌గా 2021లో రావ‌ల్పిండి వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాపై టెస్టు మ్యాచ్ విజ‌యాన్ని పాక్ న‌మోదు చేసింది. అప్ప‌టి నుంచి 11 మ్యాచ్‌లు ఆడిన పాక్ జ‌ట్టు.. రెండు డ్రాలు, తొమ్మిదింట ఓట‌మి పాలైంది.

ఈ క్ర‌మంలో కెప్టెన్ షాన్ మ‌సూద్‌పై వేటు వేసేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సిద్ద‌మైన‌ట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ సిరీస్ త‌ర్వాత అత‌డిని త‌మ జ‌ట్టు ప‌గ్గాల‌ను త‌ప్పించాల‌ని పాక్ సెల‌క్ష‌న్ క‌మిటీ భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ ఏడాది ఆఖ‌రిలో ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు పాక్ వెళ్లనుంది.

ఈ టూర్‌కు ముందు పాక్‌కు కొత్త టెస్టు కెప్టెన్ వ‌చ్చే సూచ‌న‌లు క‌న్పిస్తున్నాయి. స్టార్ ఆల్‌రౌండ‌ర్ ఆఘా స‌ల్మాన్ లేదా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ మ‌హ్మ‌ద్ రిజ్వాన్‌కు పాక్ టెస్టు కెప్టెన్సీ బాధ్య‌త‌లు అప్ప‌గించే ఛాన్స్ ఉంది. ఇక ఇప్ప‌టికే పాక్ వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి బాబ‌ర్ ఆజం త‌ప్పుకున్నాడు. ఇక ఆక్టోబ‌ర్ 15 నుంచి ముల్తాన్ వేదిక‌గా రెండో టెస్టు ప్రారంభం కానుంది.
చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌.. భారత జట్టు ప్రకటన
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement