మరో రికార్డు బ్రేక్‌ చేసిన రూట్‌ | Most ODIs Played For England, Joe Root Topples Paul Collingwood | Sakshi
Sakshi News home page

మరో రికార్డు బ్రేక్‌ చేసిన రూట్‌

Oct 25 2026 2:52 PM | Updated on Oct 25 2026 3:05 PM

Most ODIs Played For England, Joe Root Topples Paul Collingwood

source: X

ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ మరో ఘనత సాధించాడు. ఇంగ్లండ్ తరఫున అత్యధిక వన్డేలు ఆడిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. పాకిస్తాన్‌తో ఇవాళ జరుగుతున్న ట్రై సిరీస్ మ్యాచ్‌లో బరిలోకి దిగడంతో మాజీ ఆటగాడు పాల్ కాలింగ్‌వుడ్‌ను అధిగమించాడు.

2013 జనవరిలో రాజ్‌కోట్ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో రూట్ వన్డేల్లో అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి ఇంగ్లండ్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 69 పరుగులు చేసిన రూట్.. వన్డేల్లో 8000 పరుగుల మైలురాయిని కూడా అందుకున్నాడు.

ఇంగ్లండ్ తరఫున అత్యధిక వన్డేలు ఆడిన ఆటగాళ్లు
1. ఇయాన్ మోర్గాన్ – 225 మ్యాచ్‌లు
2. జోస్ బట్లర్ – 204 మ్యాచ్‌లు
3. జో రూట్ – 198 మ్యాచ్‌లు
4. పాల్ కాలింగ్‌వుడ్ – 197 మ్యాచ్‌లు
5. జేమ్స్ అండర్సన్ – 194 మ్యాచ్‌లు

ఇంగ్లండ్ తరఫున 200కు పైగా వన్డేలు ఆడిన ఆటగాళ్లు ఇయాన్ మోర్గాన్, జోస్ బట్లర్ మాత్రమే. రూట్ మరో రెండు మ్యాచ్‌లు ఆడితే 200 మ్యాచ్‌ల మైలురాయిని కూడా చేరుకుంటాడు. 2027 వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో అతడు మరిన్ని రికార్డులు సాధించే అవకాశం ఉంది.

సిరీస్‌లో నిలవాలంటే ఇంగ్లండ్‌కు విజయం తప్పనిసరి
పాక్‌లో జరుగుతున్న ట్రై సిరీస్‌లో నిలబడాలంటే ఇవాళ పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌ కీలమైందిగా మారింది. గత మ్యాచ్‌లో శ్రీలంకపై భారీ స్కోరు (429/) చేసినప్పటికీ,  ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓటమి చవిచూసింది. పాక్‌తో ఇవాల్టి మ్యాచ్‌ ఓడితే ఇంగ్లండ్ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. గెలిస్తే అక్టోబర్ 29న శ్రీలంకతో జరిగే మ్యాచ్ కీలకంగా మారుతుంది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. లాహోర్‌ వేదికగా పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. షాహీన్‌ అఫ్రిది (2-24), హరీస్‌ రౌఫ్‌ (1-16) ధాటికి ఆ జట్టు ఆదిలోనే కష్టాల్లో పడింది. 52 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కనీస స్కోర్‌ కోసం​ పోరాడుతోంది. బాంటన్‌ (4), రూట్‌ (5), బ్రూక్‌ (1), కాక్స్‌ (6) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే ఔట్‌ కాగా.. డకెట్‌ (45), కర్రన్‌ (19) ఇన్నింగ్స్‌ను నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. 14 ఓవర్ల ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ స్కోర్‌ 83-4గా ఉంది. 

ఇదీ చదవండి: బంగ్లాదేశ్ కోచింగ్ స్టాఫ్‌లోకి సౌతాఫ్రికా దిగ్గజం..!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement