పాక్‌కు చుక్కలు.. హ్యారీ బ్రూక్ విధ్వంస‌క‌ర డ‌బుల్ సెంచ‌రీ | Harry Brook slams maiden Test double century on Multan in PAK vs ENG 1st Test | Sakshi
Sakshi News home page

ENG vs PAK: పాక్‌కు చుక్కలు.. హ్యారీ బ్రూక్ విధ్వంస‌క‌ర డ‌బుల్ సెంచ‌రీ

Oct 10 2024 1:26 PM | Updated on Oct 10 2024 1:35 PM

Harry Brook slams maiden Test double century on Multan in PAK vs ENG 1st Test

ముల్తాన్ వేదిక‌గా పాకిస్తాన్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ బ్యాట‌ర్లు ప‌రుగులు వ‌ర‌ద పారిస్తున్నారు. మొద‌టి ఇన్నింగ్స్‌లో ఇప్ప‌టికే జో రూట్ డ‌బుల్ సెంచ‌రీతో చెల‌రేగగా.. ఇప్పుడు ఈ జాబితాలోకి స్టార్ బ్యాట‌ర్ హ్యారీ బ్రూక్ చేరాడు. 

ముల్తాన్ టెస్టులో బ్రూక్ విధ్వంస‌క‌ర డ‌బుల్ సెంచ‌రీతో మెరిశాడు. బ్యాటింగ్‌కు స్వ‌ర్గ‌ధామంలా ఉన్న ముల్తాన్ పిచ్‌పై బ్రూక్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. వ‌న్డేను త‌ల‌పిస్తూ పాక్ బౌల‌ర్ల‌ను ఊతికారేశాడు. ఈ క్ర‌మంలో కేవ‌లం 18 ఫోర్లు, 1 సిక్సర్‌తో బ్రూక్ తొలి డ‌బుల్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. ప్ర‌స్తుతం 218 ప‌రుగుల‌తో బ్యాటింగ్ చేస్తున్నాడు.

అది పిచ్ కాదు.. హైవే!
తొలి టెస్టుకు సిద్దం చేసిన‌ ముల్తాన్ పిచ్‌పై స‌ర్వాత్ర విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ఈ వికెట్ ఏ మాత్రం టెస్ట్ క్రికెట్‌కు ప‌నికిరాద‌ని మాజీ క్రికెట‌ర్లు అభిప్రాయప‌డుతున్నారు. కనీసం స్వింగ్‌, ట‌ర్న్ లేకుండా హైవేలా ఉంద‌ని సెటైర్‌లు వేస్తున్నారు. 

ఇంగ్లండ్ మాజీ క్రికెట‌ర్ కెవిన్ పీట‌ర్స‌న్ ఎటువంటి పిచ్ టెస్టు క్రికెట్‌ను నాశ‌నం చేస్తుంద‌ని విమ‌ర్శ‌లు గుప్పించాడు. ఇంగ్లండ్ ప్ర‌స్తుతం త‌మ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల న‌ష్టానికి 658 ప‌రుగులు చేసింది. క్రీజులో హ్యారీ బ్రూక్‌(220), జో రూట్‌(259) ఉన్నారు.

 వీరిద్ద‌రూ నాలుగో వికెట్‌కు 414 ప‌రుగుల ఆజేయ భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. అంత‌కుముందు పాక్ త‌మ మొద‌టి ఇన్నింగ్స్‌లో 556 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. ఇంగ్లండ్ ప్ర‌స్తుతం 111 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ దాదాపుగా డ్రా అయ్యే సూచ‌న‌లు క‌న్పిస్తున్నాయి.
చదవండి: IND vs BAN: వారెవ్వా హార్దిక్‌.. సూపర్‌ మ్యాన్‌లా డైవ్‌ చేస్తూ! వీడియో

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement