ENG vs PAK: ఇంగ్లండ్‌కు ఓ గుడ్‌న్యూస్‌.. ఓ బ్యాడ్ న్యూస్‌ | England captain Buttler to miss 3rd T20I vs Pakistan | Sakshi
Sakshi News home page

ENG vs PAK: ఇంగ్లండ్‌కు ఓ గుడ్‌న్యూస్‌.. ఓ బ్యాడ్ న్యూస్‌

May 27 2024 8:38 PM | Updated on May 27 2024 8:42 PM

England captain Buttler to miss 3rd T20I vs Pakistan

కార్డిఫ్ వేదిక‌గా పాకిస్తాన్‌తో జ‌ర‌గ‌నున్న‌ మూడో టీ20కు ముందు ఇంగ్లండ్‌కు బిగ్ షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు కెప్టెన్ జోస్ బట్ల‌ర్ మూడో టీ20కు దూరమ‌య్యాడు. బ‌ట్ల‌ర్ భార్య లూయిస్ త‌మ మూడో బిడ్డ‌కు జ‌న్మనివ్వ‌నుండ‌డంతో.. బ‌ట్ల‌ర్ పితృత్వ సెలువు తీసుకున్నాడు. 

ఈ క్రమంలోనే మూడో టీ20కు జోస్ దూరం కానున్నాడు. నాలుగో టీ20కు కూడా అతడి అందుబాటులో ఉండేది అనుమానమే. బట్లర్ గైర్హజరీలో స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ ఇంగ్లీష్ జట్టును నడిపించనున్నాడు. 

అయితే తొలుత బట్లర్ టీ20 వరల్డ్‌కప్‌-2024లోని తమ ప్రారంభ మ్యాచ్‌లకు బట్లర్ దూరమవుతాడని అంతా భావించారు. కానీ అనుకున్న సమయం కంటేముందు తన భార్య బిడ్డ‌కు జ‌న్మ‌నించే అవ‌కాశం  ఉంది.

దీంతో అతడు ఈ మెగా ఈవెంట్ మొత్తం మ్యాచ్‌లకు అందుబాటులో ఉండనున్నట్లు ఇంగ్లండ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇక నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20లో పాక్‌పై ఇంగ్లండ్ 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 

ఈ మ్యాచ్‌లో జోస్ బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బట్లర్ 51 బంతుల్లో  8 ఫోర్లు, 3 సిక్సర్లతో 84 పరుగులు చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement