IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్‌ కీలక అడుగు | Delhi Capitals Lock Ben Duckett Replacement, Star All Rounder Joins Squad | Sakshi
Sakshi News home page

IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్‌ కీలక అడుగు

Apr 3 2026 6:25 PM | Updated on Apr 3 2026 6:39 PM

Delhi Capitals Lock Ben Duckett Replacement, Star All Rounder Joins Squad

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ నిఖిల్‌ చౌధరి ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరినట్లు తెలుస్తుంది. తాజాగా జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌లో అతను డీసీ ఆటగాళ్లతో కలిసి కనిపించాడు. దీంతో నిఖిల్‌ను జట్టు నుంచి చివరి నిమిషంలో వైదొలిగిన ఇంగ్లండ్‌ ఆటగాడు బెన్‌ డకెట్‌కు ప్రత్యామ్నాయంగా తీసుకున్నారన్న టాక్‌​ నడుస్తుంది. దీనిపై ఎలాంటి అధికారక ప్రకటన లేనప్పటికీ.. డీసీ మాత్రం నిఖిల్‌ను లాక్‌ చేసుకున్నట్లు స్పష్టమవుతుంది. 

నిఖిల్‌ భారత మూలాలున్న ఆస్ట్రేలియా ఆటగాడు. ఇతను ఢిల్లీలో జన్మించాడు. కుటుంబంతో సహా చిన్నతనంలోనే ఆస్ట్రేలియాకి వెళ్లిన నిఖిల్‌..  టాస్మానియా తరఫున క్రికెట్‌ ఆడే అవకాశం దక్కించుకున్నాడు. 29 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్‌ ఐపీఎల్‌ 2026 వేలంలో విదేశీ ఆటగాడిగా నమోదు చేసుకున్నప్పటికీ ఎవరూ కొనుగోలు చేయలేదు.

నిఖిల్‌ తాజాగా ముగిసిన బిగ్‌బాష్‌ లీగ్‌లో హోబార్ట్‌ హరికేన్స్‌ తరఫున రాణించాడు. ఈ సీజన్‌లో అతను 11 ఇన్నింగ్స్‌ల్లో 153.50 స్ట్రైక్‌ రేట్‌తో 307 పరుగులు చేశాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌ చేసే నిఖిల్‌ ఫినిషర్‌గానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. లెగ్‌ స్పిన్‌ బౌలింగ్‌ చేయగల సామర్థ్యం కూడా ఉన్న నిఖిల్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌కు మిడిలార్డర్‌లో ఉపయోగకరమైన ఆటగాడిగా మారవచ్చు.

ఇదిలా ఉంటే, ఢిల్లీ ఈ సీజన్‌ను గెలుపుతో బోణీ కొట్టింది. తాజాగా ముగిసిన మ్యాచ్‌లో ఈ జట్టు లక్నో సూపర్‌ జెయింట్స్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సమీర్‌ రిజ్వి (47 బంతుల్లో 70 నాటౌట్‌; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్బుతంగా ఆడి ఢిల్లీని గెలిపించాడు. అతనికి ట్రస్టన్‌ స్టబ్స్‌ (32 బంతుల్లో 39 నాటౌట్‌; 3 ఫోర్లు, సిక్స్‌) సహకరించాడు.

ఢిల్లీ తమ తదుపరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ రేపు ఢిల్లీ వేదికగా మధ్యాహ్నం 3:30 గంటలకు మొదలవుతుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement