రంగులు మార్చుకునే ఎడారి..! | key facts about Africas Namib Desert Welwitschia Plains | Sakshi
Sakshi News home page

రంగులు మార్చుకునే ఎడారి..!

May 25 2025 11:54 AM | Updated on May 25 2025 11:54 AM

key facts about Africas Namib Desert Welwitschia Plains

సోసుస్‌వ్లీ– ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశం. ఇది నమీబియా ఎడారిలో ఉన్న మైదానం. దాని చుట్టూ ఎత్తయిన ఎర్రని ఇసుక, బంకమట్టితో కూడిన మట్టితిన్నెలు ఇట్టే ఆకట్టుకుంటాయి. వేళను బట్టి, కాలాన్ని బట్టి ఇవి అద్భుతమైన రంగులను సంతరించుకుంటాయి. రంగురంగుల మట్టితిన్నెలతో కూడిన ఈ ప్రాంతం ఫొటోగ్రాఫర్స్‌ మెచ్చే ప్రత్యేకమైన ప్రదేశం. ఇక్కడ డ్యూన్‌–45 అనే మట్టితిన్నె ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. 

సందర్శకులు దీని పైకెక్కి చుట్టుపక్కల విశాలమైన ప్రకృతి దృశ్యాలను ఆస్వాదిస్తుంటారు. ఇక్కడ మరో ముఖ్యమైన చోటు ఏంటంటే డెడ్‌వ్లీ అనే ప్రదేశం. ఇక్కడ వందల సంవత్సరాల నాటి చనిపోయిన కేమెల్‌ థోర్న్‌ చెట్లు తెల్లటి బంకమట్టి నేలపై నిటారుగా నిలబడి ఉంటాయి. అవి ఒక అద్భుతమైన దృశ్యాన్నిస్తాయి. 

(చదవండి: ఇదేం పండుగ సామీ..! ఏకంగా ప్రాణాలనే పణంగా పెట్టి..)

Advertisement
 
Advertisement
Advertisement