breaking news
Namib Desert
-
తవ్వకాల్లో 500 ఏళ్ల ఓడ.. బంగారం ఎంతుందంటే..!
ఆఫ్రికాలో 500 సంవత్సరాల పురాతన ఓడ ఏడారిలో జరిపిన తవ్వకాల్లో శాస్త్రవేత్తలకు లభ్యమయ్యింది. అయితే సముద్ర గర్భంలో ఉండాల్సిన నౌక ఇంత భారీ పరిమాణం గల నౌక ఇసుక ఏడారిలోకి ఎలా వచ్చిందబ్బా అని వారు తొలుత హవాక్కయ్యారు. తాజాగా అందులో అపారమైన బంగారం. వెండితో పాటు పెద్ద మెుత్తంలో ఖజానా దొరికింది.2008 సంవత్సరంలో ఆఫ్రికాలోని నమీబియాలో నమీబ్ ఏడారిలో వజ్రాల కోసం శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపారు. అప్పుడు ఆశ్చర్యకరంగా 500 సంవత్సరాల పురాతన బోమ్ జీసస్ అనే నౌకను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందులో దాదాపు 2వేల బంగారు నాణేలు, వెండి నాణేలు, వందల కిలోగ్రాములు రాగి కడ్డీలు ఇతర జంతువుల దంతాలు లభించాయి. దీంతో దానిపై పురావస్తు శాస్త్రవేత్తలు దానిపై పరిశోధన జరపగా అది వాణిజ్య నౌకగా గుర్తించారు.అయితే ఆ నౌక 1533 సంవత్సరంలో ఆఫ్రికా నుంచి భారత్కు వాణిజ్యానికి వెళుతోందని తెలిపారు. ఆ సమయంలో నమిబీయా తీరాన్ని తీవ్ర మంచుతుపాను తాకడంతో ఓడ రాళ్లను ఢీకొట్టి మునిగిపోయి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. ఆ సమయంలో ఓడలో ప్రయాణించిన వారి అవశేషాలు ఎక్కడ లభ్యం కాలేదు ఈ విషయం వారికి ఇప్పటికీ రహస్యంగానే ఉంది. -
రంగులు మార్చుకునే ఎడారి..!
సోసుస్వ్లీ– ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశం. ఇది నమీబియా ఎడారిలో ఉన్న మైదానం. దాని చుట్టూ ఎత్తయిన ఎర్రని ఇసుక, బంకమట్టితో కూడిన మట్టితిన్నెలు ఇట్టే ఆకట్టుకుంటాయి. వేళను బట్టి, కాలాన్ని బట్టి ఇవి అద్భుతమైన రంగులను సంతరించుకుంటాయి. రంగురంగుల మట్టితిన్నెలతో కూడిన ఈ ప్రాంతం ఫొటోగ్రాఫర్స్ మెచ్చే ప్రత్యేకమైన ప్రదేశం. ఇక్కడ డ్యూన్–45 అనే మట్టితిన్నె ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. సందర్శకులు దీని పైకెక్కి చుట్టుపక్కల విశాలమైన ప్రకృతి దృశ్యాలను ఆస్వాదిస్తుంటారు. ఇక్కడ మరో ముఖ్యమైన చోటు ఏంటంటే డెడ్వ్లీ అనే ప్రదేశం. ఇక్కడ వందల సంవత్సరాల నాటి చనిపోయిన కేమెల్ థోర్న్ చెట్లు తెల్లటి బంకమట్టి నేలపై నిటారుగా నిలబడి ఉంటాయి. అవి ఒక అద్భుతమైన దృశ్యాన్నిస్తాయి. (చదవండి: ఇదేం పండుగ సామీ..! ఏకంగా ప్రాణాలనే పణంగా పెట్టి..) -
ఎడారిలో ఇసుక మనిషి..?
వింటూక్: హాలిడే ట్రిప్ లో భాగంగా ఎడారికి వెళ్లిన 23 ఏళ్ల యువతి.. ఇసుకమనిషి(శాండ్ మ్యాన్)ని గుర్తించి సంచలనానికి కారకురాలైంది. మొనాకో(యూరప్) కు చెందిన ఆ యువతి కుటుంబం ఇటీవలే నైరుతి ఆఫ్రికాలోని నమీబియాలో పర్యటించింది. 8 కోట్ల సంవత్సరాల కిందటే ఏర్పడి, ప్రస్తుతం భూగోళంమీది ఎడారుల్లో పాతదిగా భావించే నైజీరియా ఎడారిలో ఈ దృశ్యాన్ని ఆమె ఎలా గుర్తించిందంటే.. హెలికాప్టర్ అద్దెకు తీసుకుని కుటుంబంతో సహా నమీబియా ఎడారిపై చక్కర్లు కొట్టిన ఆ యువతి.. పర్యటన ముగిసన తర్వాత తండ్రి తీసిన ఫొటోలను పరిశీలిస్తుండగా ఒక చోట ఇసుకతెన్నెలు అచ్చం మనిషి ముఖాన్ని పోలి ఉండటం గమనించింది. వెంటనే ‘ఎడారిలో ఇసుకమనిషి’ని చూడానంటూ సోషల్ మీడియాలో ఫొటోను పోస్ట్ చేసింది. అదికాస్తా వైరల్ అయి, వార్తగా మారింది. ‘అమేజింగ స్పైడర మ్యాన్’లాంటి సినిమాల్లో తప్ప గగుర్పాటుకు గురిచేసే ఇసుకమనుషులు లేరన్న సంగతి మనకు తెలియదాఏంటి?


