జపాన్‌లో తొలి ఒమిక్రాన్‌ కేసు..!!

Japan confirms first Omicron Covid Case Day After Banned Foreigner - Sakshi

Japan confirms first Omicron Covid Case: జపాన్‌ కొత్త కరోనా వైరస్‌ వేరియంట్‌ దృష్ట్యా విదేశీయులను నిషేధించిన తర్వాత రోజే తొలి ఒమిక్రాన్‌ వైరస్‌ కేసును గుర్తించనట్లు ప్రకటించింది. అయితే నమీబియా నుంచి వచ్చిన 30 ఏళ్ల ప్రయాణికుడిని ప్రభుత్వ నిబంధన మేరకు చేసిని కరోనా పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చింది. దీంతో అతనిని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్‌లో ఉంచి చేసిన పలు పరీక్షలో ఓమిక్రాన్ కేసుగా నిర్ధారించబడిందని ప్రభుత్వ ప్రతినిధి హిరోకాజు మట్సున్‌ అన్నారు.

(చదవండి: బాప్‌రే!... రెండు తలలు ఉన్న బల్లిని చూశారా!!)

అంతేకాదు హిరోకాజు జపాన్‌లో ధృవీకరించిన తొలి కేసుగా పేర్కొన్నారు. ఇటీవలే జపాన్‌ కొంత మంది విద్యార్థులకు, వ్యాపార నిమిత్తం విదేశాలు ప్రయాణించే వారికి కొన్ని నిబంధనలు సడలించింది. అయితే దక్షణాఫ్రికా ఒమిక్రాన్‌ కొత్త కరోనా వైరస్‌ ఆందోళనల నేపథ్యంలో జపాన్‌ ఈ కరోనా ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. ఈ మేరకు జపాన్‌ కొత్త నిబంధనలు ప్రకారం జపాన్ పౌరులు, ఇప్పటికే ఉన్న విదేశీ నివాసితులు మాత్రమే దేశంలోకి ప్రవేశిగలరని అధికారులు అన్నారు. పైగా జపాన్‌ దాదాపు 77 శాతం వ్యాక్సినేషన్‌ ప్రకియను విజయవంతంగా పూర్తి చేసింది.

(చదవండి: ఆ వైరస్‌ని చూసి భయపడుతూ.. తిట్టుకుంటూ కూర్చోవద్దు!!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top