టీ20 ప్రపంచకప్-2022కు 16 మంది సభ్యలతో కూడిన తమ జట్టును నమీబియా క్రికెట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. ఈ జట్టుకు గెర్హార్డ్ ఎరాస్మస్ సారథ్యం వహించనున్నాడు. నమీబియా యువ బ్యాటర్లు లోహన్ లౌరెన్స్, దివాన్ లా కాక్, పేసర్ తంగేని లుంగమేని తొలిసారిగా టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనున్నారు.
కాగా గతేడాది యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో నమీబియా అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. శ్రీలంక, నెదర్లాండ్స్, ఐర్లాండ్ వంటి జట్లును ఓడించి టీ20 ప్రపంచకప్-2021లో సూపర్ 12 దశకు నమీబియా చేరుకుంది. సూపర్-12లో తమ పోరాట పటమతో అందరినీ నమీబియా అకట్టుకుంది. ఇక టీ20 ప్రపంచకప్-2022 రౌండ్-1లో గ్రూప్ Aలో శ్రీలంక, నెదర్లాండ్స్, యూఏఈ వంటి జట్లతో నమీబియా తలపడనుంది. కాగా ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే.
టీ20 ప్రపంచకప్‌కు నమీబియా జట్టు: గెర్హార్డ్ ఎరాస్మస్ (కెప్టెన్), జెజె స్మిత్, దివాన్ లా కాక్, స్టీఫెన్ బార్డ్, నికోల్ లాఫ్టీ ఈటన్, జాన్ ఫ్రైలింక్, డేవిడ్ వైస్, రూబెన్ ట్రంపెల్‌మాన్, జేన్ గ్రీన్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, టాంగెని లుంగమేని, మైఖేల్ వాన్ లింగేన్, బెన్ షికోన్‌గోస్ట్, బెన్ షికోన్‌గోస్ట్, , లోహన్ లౌరెన్స్, హెలావో యా ఫ్రాన్స్.
చదవండి: Urvashi Rautela: లైట్ తీసుకున్న పంత్.. చేతులు జోడించి సారీ చెప్పిన ఊర్వశి.. వీడియో వైరల్!
Comments
Please login to add a commentAdd a comment