Urvashi Rautela: లైట్‌ తీసుకున్న పంత్‌.. చేతులు జోడించి సారీ చెప్పిన ఊర్వశి.. వీడియో వైరల్‌!

Rishabh Pant: Urvashi Rautela Says Sorry To Him Amid Controversy Viral - Sakshi

Rishabh Pant- Urvashi Rautela: టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌, బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతేలా మధ్య వివాదానికి తెరపడినట్లు తెలుస్తోంది. తాజాగా ఓ వీడియోలో ఊర్వశి.. పంత్‌కు సారీ చెబుతూ కనిపించడం ఇందుకు నిదర్శనం. కాగా టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ను ఉద్దేశించి ఆర్పీ అనే వ్యక్తి తన కోసం ఎయిర్‌పోర్టులో గంటల తరబడి ఎదురుచూశాడంటూ ఊర్వశి ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడంతో వివాదం మొదలైంది.

ఇందుకు స్పందించిన పంత్‌.. కొందరు ఫేమస్‌ కావడానికి అబద్ధాలు ఆడతారంటూ కౌంటర్‌ ఇచ్చాడు. అంతేకాదు.. అక్కా నన్ను వదిలెయ్‌ అంటూ ఘాటు విమర్శలు చేశాడు. ఇందుకు బదులుగా ఊర్వశి సైతం.. ‘‘తమ్ముడూ నువ్వు ఒక పిల్ల బచ్చా.. బ్యాట్‌, బంతితో ఆటకే పరిమితమవ్వు’’ అని ప్రతి విమర్శ చేసింది.

ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా స్పందించింది. ఇక ఊర్వశి పోస్టు నేపథ్యంలో పంత్‌ సైతం.. ‘‘నీ ఆధీనంలో లేని అంశాల గురించి నువ్వు ఒత్తిడికి గురికావాల్సిన అవసరం లేదు’’ అంటూ ఓ కోట్‌ షేర్‌ చేశాడు. తద్వారా ఊర్వశిని లైట్‌ తీసుకుంటున్నా అని చెప్పకనే చెప్పాడు.

పంత్‌కు సారీ చెప్పిన బాలీవుడ్‌ నటి ఊర్వశి
ఈ నేపథ్యంలో తాజాగా ఊర్వశికి సంబంధించి ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇన్‌స్టాంట్‌ బాలీవుడ్‌ రిపోర్టర్‌ ఊర్వశిని పలకరిస్తూ.. ‘‘ఆర్పీకి మీరు మెసేజ్‌ ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా? నేను మీకోసం వెదికాను.. సూటిగా ఈ విషయం అడుగుతున్నాను’’ అని పేర్కొన్నాడు.

ఇందుకు కాస్త తికమక పడ్డ ఊర్వశి.. ‘‘నేను ఏం చెప్పాలనుకుంటున్నాననంటే.. అవునూ ఏం చెప్పాలనుకుంటున్నా? నాకే తెలియదు.. అయితే.. ఒక్క విషయం సారీ.. ఐయామ్‌ సారీ’’ అంటూ చేతులు జోడిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. 

ఈ వీడియో చూసిన నెటిజన్లు.. పంత్‌ ఆమెను లైట్‌ తీసుకుని.. తన పని తాను చేసుకుపోతున్నాడు.. అందుకే ఆమే ఇలా దిగి వచ్చి క్షమాపణలు కోరింది.. అతడితో స్నేహం కోరుకుంటుందేమో అంటూ ఇష్టారీతిన కామెంట్లు చేస్తున్నారు. ఇక పంత్‌ ఫ్యాన్స్‌ మాత్రం.. ఆర్పీతో అట్లుంటది మరి అన్నట్లుగా సరదాగా పేర్కొంటున్నారు.

కాగా 24 ఏళ్ల పంత్‌ ఇటీవలే ఉత్తరాఖండ్‌ రాష్ట్ర బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఆసియా కప్‌-2022 టోర్నీలో టీమిండియాకు ఆడిన పంత్‌.. ప్రపంచకప్‌-2022 జట్టుకు సైతం ఎంపికయ్యాడు. ప్రస్తుతం ఈ ఐసీసీ మెగా టోర్నీకి సన్నద్ధమయ్యే పనిలో ఉన్నాడు. మరి ఊర్వశి సారీ చెప్పడంపై పంత్‌ ఏవిధంగా స్పందిస్తాడో చూడాలి! అని ఫ్యాన్స్‌ గుసగుసలాడుకుంటున్నారు.

చదవండి: శ్రీలంక కష్టమే! ఆసీస్‌ ముందంజలో! అదే జరిగితే ఫైనల్లో భారత్‌- పాకిస్తాన్‌!
తిరుగులేని కోహ్లి.. సరికొత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా ఘనత!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top