Rishabh Pant Counter To Actress Urvashi Rautela Comments In Viral Interview - Sakshi
Sakshi News home page

Rishabh Pant-Uravasi Rautela: బాలీవుడ్‌ హీరోయిన్‌కు పంత్‌ దిమ్మతిరిగే కౌంటర్‌

Published Thu, Aug 11 2022 11:50 AM

Rishabh Pant Counter Actress Urvashi Rautela Funny People Lie Interviews - Sakshi

ప్రేమకు ఎవరు అతీతులు కారు. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అందరూ ఏదో ఒక దశలో ప్రేమలో మునిగి తేలిన వాళ్లే. క్రికెటర్లు అందుకు మినహాయింపు కాదు. ముఖ్యంగా బాలీవుడ్‌ హీరోయిన్స్‌తో క్రికెటర్లు నడిపిన ఎఫైర్స్‌కు లెక్కే లేదు. కొన్ని పెళ్లిపీటల వరకు వచ్చి ఆగిపోతే.. మరికొన్ని ప్రేమలు మాత్రం సక్సెకు దారి తీసి పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.  షర్మిలా ఠాగూర్‌- మన్సూర్‌ అలీఖాన్‌ పటౌడీ, విరాట్‌ కోహ్లి- అనుష్క శర్మ, హర్భజన్‌ సింగ్‌-గీతా బస్రా, యువరాజ్‌ సింగ్‌- హాజెల్‌కీచ్‌,  రవిశాస్త్రి- అమృతాసింగ్‌, మమ్మద్‌ అజారుద్దీన్‌-సంగీతా బిజలాని ఈ కోవకు చెందిన వారే.

అయితే కొందరు సెలబ్రిటీలు మాత్రం తమ స్వార్థ ప్రయోజనాల కోసం కల్పిత కథలు అల్లి క్రికెటర్లతో ప్రేమ వ్యవహారం ఉన్నట్లుగా చెప్పుకుంటారు. కొన్నిసార్లు అవి కలిసొచ్చినా.. కొన్ని సందర్భాల్లో ఎదురుదెబ్బలు తగులుతుంటాయి. తమ పేరు, ప్రఖ్యాతలు పెంచుకోవడానికే ఇలాంటివి చేస్తుంటారు. తాజాగా బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతేలా- టీమిండియా యంగ్‌ క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌ వ్యవహారం ఇదే అంశాన్ని గుర్తుచేస్తుంది.

గతంలో ఊర్వశి రౌతేలా కోసం రిషబ్‌ పంత్‌ ఎయిర్‌ పోర్ట్‌లో 16 గంటల పాటు ఎదురుచూశాడంటూ కొన్ని కథనాలు వచ్చాయి. దీంతో వీరిద్దరి మధ్య ఎఫైర్‌ ఉందనే వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా ఒక  ఇంటర్య్వూలో పాల్గొన్న ఊర్వశి రౌతేలా పంత్‌తో ప్రేమ వ్యవహారంపై హాట్‌ కామెంట్స్‌ చేసింది. తనను ఒక వ్యక్తి ప్రేమిస్తున్నాడని.. నేనంటే పడి చచ్చిపోతున్నాడంటూ.. నన్ను కలవడానికి వెయిట్‌ చేస్తున్నాడని... అతని పేరు చెప్పను గానీ షార్ట్‌ఫామ్‌లో మాత్రం ''ఆర్‌పీ(RP)'' అని పేర్కొంది.

దీంతో ఊర్వశి మరోసారి రిషబ్‌ పంత్‌ పేరు ప్రస్తావించిందంటూ క్రికెట్‌ ఫ్యాన్స్‌ పేర్కొన్నారు. ''ఆర్‌పీ'' అంటే కచ్చితంగా రిషబ్‌ పంత్‌ అయి ఉంటాడని చెవులు కొరుక్కున్నారు. దీనికి ఊతమిస్తూ.. ''గతంలో నేను వారణాసిలో షూటింగ్‌ ముగించుకొని ఒక షో కోసం ఢిల్లీ వెళ్లాను. అక్కడ దాదాపు 10 గంటల పాటు షూటింగ్‌ జరిగింది. దీంతో చాలా అలిసిపోయి ఇంటికెళ్లాను. అప్పటికే మిస్టర్‌ ఆర్‌పీ(RP) మా ఇంటికొచ్చి నాకోసం లాబీలో వెయిట్‌ చేస్తున్నాడని తెలిసింది. దీంతో అతని కోసం రెడీ అవ్వాలనుకున్నా. కానీ రోజంతా పని చేయడంతో బాగా అలిసిపోయిన నాకు వెంటనే నిద్ర పట్టేసింది. ఈ సమయంలో నా ఫోన్‌కు చాలా కాల్స్‌ వచ్చాయి. కానీ ఫోన్‌ లేపలేకపోయా. లేచి చూస్తే దాదాపు 16-17 మిస్‌డ్‌ కాల్స్‌ ఉన్నాయి'' అంటూ బాలీవుడ్‌ హంగామాకు ఇచ్చిన ఇంటర్య్వూలో పేర్కొంది. ఊర్వశి రౌతేలా వీడియో సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయింది.

తనపై వస్తున్న తప్పుడు వార్తలపై స్వయంగా రిషబ్‌ పంత్‌ రంగంలోకి దిగాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టును షేర్‌ చేస్తూ బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతేలా పేరును ఎక్కడా ప్రస్తావించకుండా తనదైన శైలిలో దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చాడు. ''ఇంటర్య్వూల్లో కొంతమంది తమ పేరు, ప్రఖ్యాతల కోసం ఎంత స్థాయికైనా దిగజారుతుంటారు. ఇది చాలా ఫన్నీగా అనిపిస్తోంది. తమ స్వార్థ ప్రయోజనాల కోసం అవతలి వ్యక్తులను ఇబ్బందుల్లో పడేస్తుంటారు. దేవుడు వారిపై కాస్త కరుణ చూపించాలి.. #merapichachorhoBehen #jhutkibhilimithotihai..  ప్లీజ్‌ అక్క.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. అబద్దాలు ఆడడానికైనా ఒక లిమిట్‌ ఉంటుంది'' అంటూ కాప్షన్‌ జత చేశాడు. మరి పంత్‌ చేసిన వ్యాఖ్యలపై  ఊర్వశి రౌతేలా ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

చదవండి: హీరోయిన్ కోసం 16 గంటలు వెయిట్‌ చేసిన రిషబ్‌ పంత్‌ !

నలుగురు పిల్లలున్న ఆ సింగర్‌ పెళ్లికి ప్రపోజ్‌ చేశాడు: హీరోయిన్‌

Advertisement
 
Advertisement
 
Advertisement