నందమూరి బాలకృష్ణ సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ అప్పుడప్పుడు స్టంట్స్ చేస్తుంటారు. అంతేకాకుండా తన కోపంతో అభిమానులపై చేయి కూడా చేసుకుంటారు. అలా చాలాసార్లు వేదికలపై విమర్శలు ఎదుర్కొన్నారు. తాజాగా సినిమాల్లో లాగా ఓ స్టంట్ చేయబోయి నవ్వుల పాలయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంతమ స్టైల్లో అద్దాలను గాల్లోకి ఎగరేశాడు బాలయ్య. కానీ అది వర్కవుట్ కాలేదు. అద్దాలు కాస్తా కింద పడిపోవడంతో వెంటనే తీసుకుని జేబులో వేసుకోవడానికి ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు
ఇక బాలయ్య సినిమాల విషయానికొస్తే గతేడాది అఖండ-2 మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. బోయపాటి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ మూవీని అఖండకు సీక్వెల్‌గా తెరకెక్కించారు.
పాపం బాలయ్య..!
మరో స్టంట్ చేయబోయి.. అవమానంపాలైన నటుడు
రజినీకాంత్ స్టైల్ లో అద్దాలను గాల్లో ఎగరేసి, జేబులో వేసుకోవడానికి ప్రయత్నం
కానీ, అది కిందపడిపోవడంతో దిక్కులు చూస్తూ మౌనం pic.twitter.com/NdITjxsFay— PulseNewsBreaking (@pulsenewsbreak) January 27, 2026


