నమీబియా నుంచి వచ్చిన చీతాల కోసం టాస్క్‌ఫోర్స్‌

Task Force For Cheetahs From Namibia - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల నమీబియా నుంచి తీసుకొచ్చి మధ్యప్రదేశ్‌లోని కునో అంతర్జాతీయ పార్కులో వదిలిన చీతాల పర్యవేక్షణకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఓ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. పార్క్‌తోపాటు సమీప ఇతర అనువైన నిర్దేశిత ప్రాంతాల్లో చీతాలను ఈ బృందం పర్యవేక్షిస్తుంది. మధ్యప్రదేశ్‌ అటవీ, పర్యాటక శాఖల ముఖ్య కార్యదర్శులతో కూడిన ఈ తొమ్మిది మంది సభ్యుల బృందానికి నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ సహకరిస్తుంది.

కొత్త ప్రాంతాన్ని చీతాలు ఏ మేరకు సొంతస్థలంగా భావిస్తాయి, చీతా ఆరోగ్య స్థితి సమీక్షించడం, వేట నైపుణ్యాలను పరీక్షించడమే లక్ష్యంగా ఈ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటైంది. బృందం చేపట్టాల్సిన ఇతరత్రా పనులను మంత్రిత్వశాఖ నిర్ధేశించింది. రెండేళ్లపాటు టాస్క్‌ఫోర్స్‌ ఈ ప్రత్యేక విధుల్లో నిమగ్నమై ఉంటుంది.
చదవండి: థాక్రే వర్గానికి ఎన్నికల సంఘం డెడ్‌లైన్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top