
నమీబియా వెటరన్ ఆల్‌రౌండర్ డేవిడ్ వీస్ పొట్టి క్రికెట్‌లో దిగ్గజాల సరసన చేరాడు. 40 ఏళ్ల వీస్ టీ20 కెరీర్‌లో 400 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా పొట్టి ఫార్మాట్‌లో ఈ ఘనత సాధించిన 29 ఆటగాడిగా రికార్డుకెక్కాడు.
టీ20 ఫార్మాట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డు విండీస్ దిగ్గజం కీరన్ పోలార్డ్ పేరిట ఉంది. పోలార్డ్ ఈ ఫార్మాట్‌లో ఏకంగా 707 మ్యాచ్‌లు ఆడాడు. పోలార్డ్ తర్వాత అత్యధిక టీ20లు ఆడిన జాబితాలో డ్వేన్ బ్రావో (582), ఆండ్రీ రసెల్ (561), షోయబ్ మాలిక్ (557), సునీల్ నరైన్ (554), డేవిడ్ మిల్లర్ (530), అలెక్స్ హేల్స్ (503), రవి బొపారా (491), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (478), రషీద్ ఖాన్ (477) టాప్-10లో ఉన్నారు.
భారత్ తరఫున అత్యధిక టీ20 ఆడిన ఘనత హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు దక్కుతుంది. రోహిత్ పొట్టి ఫార్మాట్‌లో 463 మ్యాచ్‌లు ఆడాడు. ఈ జాబితాలో రోహిత్ తర్వాతి స్థానాల్లో విరాట్ కోహ్లి (414), దినేశ్ కార్తీక్ (412), ఎంఎస్ ధోని (405), రవీంద్ర జడేజా (346) ఉన్నారు.
పొట్టి క్రికెట్‌లో డేవిడ్ వీస్ ప్రాతినిథ్యం వహించిన జట్లు..
బార్బడోస్ ట్రైడెంట్స్, కొలంబో స్టార్స్, కుమిల్లా వారియర్స్, ఈస్టర్న్స్, గయానా అమెజాన్ వారియర్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్, కరాచీ కింగ్స్, ఖుల్నా టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, లాహోర్ ఖలందర్స్, లండన్ స్పిరిట్, నమీబియా, నార్తర్న్ సూపర్‌చార్జర్స్ , పార్ల్ రాక్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, దక్షిణాఫ్రికా, దక్షిణాఫ్రికా ఎమర్జింగ్ ప్లేయర్స్, సెయింట్ లూసియా కింగ్స్, ససెక్స్, టైటాన్స్, ష్వానే స్పార్టన్స్, యార్క్‌షైర్