తొలి బంతి.. ఆఖరి బంతిని ఒకే విధంగా ముగించిన స్కాట్లాండ్‌

T20 World Cup 2021: Scotland End Innings First And Last Ball Same Way - Sakshi

Scotland End Innigs First And Last Ball Same Way.. టి20 ప్రపంచకప్‌ 2021లో నమీబియా, స్కాట్లాండ్‌ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. స్కాట్లాండ్‌ తన ఇన్నింగ్స్‌లో తొలి బంతిని.. ఆఖరి బంతిని ఒకేరీతిలో ముగించింది. అదెలా అని డౌట్‌ వద్దు.. అసలు విషయంలోకి వెళితే.. స్కాట్లాండ్‌ తొలి ఓవర్‌ తొలి బంతికే వికెట్‌ కోల్పోయింది. అలాగే ఆఖరి బంతికి కూడా రనౌట్‌ రూపంలో వికెట్‌ కోల్పోయి ఇన్నింగ్స్‌ ముగించడం విశేషం. తొలి ఓవర్‌ వేసిన ట్రంపెల్‌మన్‌ తన తొలి బంతికే జార్జ్‌ మున్సీని గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. ఇక ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌ డేవిడ్‌ వీస్‌ వేయగా.. ఆఖరి బంతికి క్రిస్‌ గ్రీవ్స్‌ 25 పరుగులు వద్ద రనౌట్‌ అయ్యాడు. సాధారణంగా ఇలాంటి సన్నివేశాలు అరుదుగా చోటుచేసుకుంటాయి. ఇక నమీబియా బౌలర్‌ రూబెన్‌ ట్రంపెల్‌మన్‌ 3 వికెట్లతో స్కాట్లాండ్‌ పతనాన్ని శాసించగా.. ఫ్రైలింక్‌ 2 వికెట్లతో రాణించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top