T20 WC 2021 NZ Vs NAM: పసికూనపై న్యూజిలాండ్‌ ప్రతాపం.. 52 పరుగుల తేడాతో ఘన విజయం

T20 World Cup 2021: New Zealand Vs Namibia Match Live Updates And Highlights In Telugu - Sakshi

పసికూనపై న్యూజిలాండ్‌ ప్రతాపం.. 52 పరుగుల తేడాతో ఘన విజయం
సమయం 18: 52.. 164 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నమీబియా.. న్యూజిలాండ్‌ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి కేవలం 111 పరుగుల మాత్రమే చేయగలిగింది. ఫలితంగా న్యూజిలాండ్‌ పసికూన నమీబియాపై 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సెమీస్‌ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. నమీబియా ఇన్నింగ్స్‌లో వాన్‌ లింగెన్‌(22), స్టీఫెన్‌ బార్డ్‌(21), జేన్‌ గ్రీన్‌(23), డేవిడ్‌ వీస్‌(17) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేయగలిగారు. కివీస్‌ బౌలర్లలో సౌథీ, బౌల్ట్‌ చెరో రెండు వికెట్లు సాధించగా.. సాంట్నర్‌, నీషమ్‌, సోధీ తలో వికెట్‌ పడగొట్టారు.   

ఓటమి దిశగా నమీబియా
సమయం 18:38.. 18వ ఓవర్‌ ఐదో బంతికి నమీబియా ఐదో వికెట్‌ కోల్పోయింది. సౌథీ బౌలింగ్‌లో బౌల్ట్‌కు క్యాచ్‌ ఇచ్చి జేన్‌ గ్రీన్‌ 27 బంతుల్లో 23; ఫోర్‌, సిక్స్‌) ఔటయ్యాడు. 18 ఓవర్ల తర్వాత నమీబియా స్కోర్‌ 102/5. 

నాలుగో వికెట్‌ కోల్పోయిన నమీబియా.. డేవిడ్‌ వీస్‌(16) ఔట్‌
ఇన్నింగ్స్‌ 15వ ఓవర్లో నమీబియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. సౌథీ బౌలింగ్‌లో డేవిడ్‌ వీస్‌(17 బంతుల్లో 16; ఫోర్‌, సిక్స్‌) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 15 ఓవర్ల తర్వాత నమీబియా స్కోర్‌ 86/4. క్రీజ్‌లో జేన్‌ గ్రీన్‌(16), జెజె స్మిట్‌ ఉన్నారు.

మూడో వికెట్‌ కోల్పోయిన నమీబియా
సమయం 17:59.. కివీస్‌ స్పిన్నర్లు నమీబియా బ్యాటింగ్‌ లయను దెబ్బ కొట్టారు. వరుస ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టారు. సాంట్నర్‌ వేసిన 8.1వ ఓవర్లో బార్డ్‌(22 బంతుల్లో 21; 2 ఫోర్లు) క్లీన్‌ బౌల్డ్‌ కాగా.. 10వ ఓవర్‌ రెండో బంతికి సోధి బౌలింగ్‌లో కాన్వేకు క్యాచ్‌ ఇచ్చి ఎరాస్మస్‌(4 బంతుల్లో 3) ఔటయ్యాడు. 10 ఓవర్ల తర్వాత నమీబియా స్కోర్‌ 56/3. క్రీజ్‌లో గ్రీన్‌(3), వీస్‌(1) ఉన్నారు. 

తొలి వికెట్‌ కోల్పోయిన నమీబియా.. 7.2 ఓవర్ల తర్వాత 47/1
సమయం 17:48.. 164 పరుగుల లక్ష్య ఛేదనలో నమీబియాకు శుభారంభం లభించింది. ఓపెనర్లు వాన్‌ లింగెన్‌(25 బంతుల్లో 25; 2 ఫోర్లు, సిక్స్‌), స్టీఫెన్‌ బార్డ్‌(19 బంతుల్లో 19; 2 ఫోర్లు) తొలి వికెట్‌కు 47 పరుగులు జోడించారు. అయితే, 7.2వ ఓవర్లో నీషమ్‌ బౌలింగ్‌లో వాన్‌ లింగెన్‌ ఔట్‌ కావడంతో నమీబియా తొలి వికెట్‌ కోల్పోయింది. 8 ఓవర్ల తర్వాత నమీబియా స్కోర్‌ 51/1.     

రాణించిన నీషమ్‌, ఫిలిప్స్‌..  నమీబియా టార్గెట్‌ 164
సమయం 17:07.. జిమ్మీ నీషమ్‌(23 బంతుల్లో 35 నాటౌట్‌; ఫోర్‌, 2 సిక్సర్లు), గ్లెన్‌ ఫిలిప్స్‌(21 బంతుల్లో 39 నాటౌట్‌; ఫోర్‌, 3 సిక్సర్లు) ఆఖర్లో చెలరేగడంతో న్యూజిలాండ్‌ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. గప్తిల్‌(18), డారిల్‌ మిచెల్‌(19), డెవాన్‌ కాన్వే(17) నిరాశపరచినా.. నీషమ్‌, ఫిలిప్స్‌, విలిమయ్సన్‌(25 బంతుల్లో 28; 2 ఫోర్లు, సిక్స్‌) ఓ మోస్తారుగా రాణించడంతో న్యూజిలాండ్‌ ఈ స్కోర్‌ను చేయగలిగింది. నమీబియా బౌలర్లలో స్కోల్జ్‌, వీస్‌, ఎరాస్మస్‌ తలో వికెట్‌ పడగొట్టారు.     

నాలుగో వికెట్‌ కోల్పోయిన న్యూజిలాండ్‌.. కాన్వే(17) రనౌట్‌
సమయం 16:30.. న్యూజిలాండ్‌కు 14వ ఓవర్‌ ఆఖరి బంతికి మరో షాక్‌ తగిలింది. అనవసర పరుగుకు ప్రయత్నించి డెవాన్‌ కాన్వే(18 బంతుల్లో 17; ఫోర్‌) రనౌటయ్యాడు. 14 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్‌ స్కోర్‌ 87/4. క్రీజ్‌లో గ్లెన్‌ ఫిలిప్‌(4), నీషమ్‌ ఉన్నారు. 

మూడో వికెట్‌ కోల్పోయిన న్యూజిలాండ్‌.. విలియమ్సన్‌(28) ఔట్‌
నమీబియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో న్యూజిలాండ్‌ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతుంది. జట్టు స్కోర్‌ 81 పరుగుల వద్ద ఉండగా.. ఎరాస్మస్‌ బౌలింగ్‌లో విలియమ్సన్‌(25 బంతుల్లో 28; 2 ఫోర్లు, సిక్స్‌)  క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఫలితంగా న్యూజిలాండ్‌ మూడో వికెట్‌ను కోల్పోయింది. 13 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్‌ స్కోర్‌ 82/3. క్రీజ్‌లో డెవాన్‌ కాన్వే, గ్లెన్‌ ఫిలిప్‌ ఉన్నారు.

న్యూజిలాండ్‌కు మరో షాక్‌.. డారిల్‌ మిచెల్‌(19) ఔట్‌
సమయం 15:57.. ఇన్నింగ్స్‌ 7వ ఓవర్‌ రెండో బంతికి న్యూజిలాండ్‌కు మరో షాక్‌ తగిలింది. బెర్నార్డ్‌ స్కోల్జ్‌ బౌలింగ్‌లో డారిల్‌ మిచెల్‌(15 బంతుల్లో 19; 2 ఫోర్లు) ఔటయ్యాడు. దీంతో న్యూజిలాండ్‌ 43 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. క్రీజ్‌లో కేన్‌ విలియమ్సన్‌(6), కాన్వే ఉన్నారు.

తొలి వి​కెట్‌ కోల్పోయిన న్యూజిలాండ్‌.. గప్తిల్‌(18) ఔట్‌
సమయం 15:48.. టాస్‌ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌.. ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. అయితే డేవిడ్‌ వీస్‌ వేసిన 5వ ఓవర్‌లో న్యూజిలాండ్‌కు తొలి ఎదురుదెబ్బ తగిలింది. వీస్‌ 4.1వ ఓవర్లో మార్టిన్‌ గప్తిల్‌(18 బంతుల్లో 18; ఫోర్‌, సిక్స్‌)ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో న్యూజిలాండ్‌ 30 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. క్రీజ్‌లో డారిల్‌ మిచెల్‌(12), కేన్‌ విలియమ్సన్‌ ఉన్నారు. 

షార్జా: టీ20 ప్రపంచకప్‌ 2021 సూపర్‌ 12 గ్రూప్‌-2లో భాగంగా శుక్రవారం(నవంబర్‌ 5) మధ్యాహ్నం 3:30 గంటలకు షెడ్యూలైన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌, నమీబియా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన నమీబియా తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ప్రస్తుత మెగా టోర్నీలో న్యూజిలాండ్‌ ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఓ పరాజయంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుండగా.. నమీబియా సూపర్‌-12లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓ విజయం, 2 పరాజయాలతో సెమీస్‌ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించింది. ఇక పొట్టి ఫార్మాట్‌లో ఇరు జట్ల మధ్య ముఖాముఖి పోరు విషయానికొస్తే.. ఈ ఫార్మాట్‌లో ఇరు జట్లు తలపడడం ఇదే తొలిసారి. 

తుది జట్లు:
న్యూజిలాండ్: మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్(కెప్టెన్‌), జేమ్స్ నీషమ్, డెవన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్(వికెట్‌ కీపర్‌), మిచెల్ సాంట్నర్, ఇష్ సోధీ, టిమ్ సౌతీ, ఆడమ్ మిల్నే, ట్రెంట్ బౌల్ట్

నమీబియా: స్టీఫెన్‌ బార్డ్‌, క్రెయిగ్ విలియమ్స్, జేన్ గ్రీన్(వికెట్‌ కీపర్‌), గెర్హార్డ్ ఎరాస్మస్(కెప్టెన్‌), డేవిడ్ వీస్, మైఖేల్ వాన్ లింగెన్, జెజె స్మిట్‌, కార్ల్‌ బిర్కెన్‌స్టాక్‌, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, రూబెన్ ట్రంపెల్‌మాన్, బెర్నార్డ్ స్కోల్ట్జ్

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top