యాంకర్ శ్రీముఖి ట్రెండ్‌ను ఫాలో అయింది.
2016నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అప్పటి ఫోటోలు షేర్ చేసింది.
అందులో ఆమె హోస్ట్ చేసిన ప్రోగ్రామ్స్, షోలకు సంబంధించిన క్లిక్స్ ఉన్నాయి.
అలాగే తను నటించిన 'నేను శైలజ' మూవీ ప్రమోషన్ ఫోటోలు కూడా ఈ పోస్ట్‌లో పొందుపరిచింది.
ఇకపోతే హీరోలు సూర్య, విక్రమ్, నాని, ఆకాశ్ పూరి, అల్లు శిరీష్..
మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్.. హీరోయిన్స్ తమన్నా, కీర్తి సురేశ్, రోజా..
యాంకర్స్ సుమ, ప్రదీప్ ఇలా చాలామంది తారలతో దిగిన ఫోటోలు పంచుకుంది.
మరి ఈ స్టార్ సెలబ్రిటీలు పదేళ్ల కిందట ఎలా ఉన్నారో ఓ లుక్కేయండి..


