అమ్మగా మారి.. ఆలనా పాలనా..! | Lion Caring Antelope in Namibia National Park | Sakshi
Sakshi News home page

అమ్మగా మారి.. ఆలనా పాలనా..!

Feb 19 2018 10:05 AM | Updated on Feb 19 2018 3:30 PM

Lion Caring Antelope in Namibia National Park - Sakshi

జింక పిల్లను సంరక్షిస్తు‍న్న సింహం

సాక్షి, వెబ్‌ డెస్క్‌ : ఫోటోలు చూసి ఆహారంతో సింహా ఆడుకుంటోందనుకుంటే మీరు పొరబడినట్లే..! ఔను. అడవి జంతువుల్లో రారాజుగా గుర్తింపు పొందిన సింహం ఓ చిన్న జింకపిల్లపై వల్లమాలిన ప్రేమను, ఆప్యాయతను పెంచేసుకుంది.

ఓ మగ సింహం దాడిలో ఆడ సింహం కూనలు ప్రాణాలు కోల్పోయాయి. ఆ ఘటనతో తీవ్ర ఒత్తిడికి గురైన ఆడ సింహం.. అడవిలో ఒంటరిగా తన కంట పడ్డ జింక పిల్లను రక్షిస్తోంది. ఈ ఆడ సింహం జింక పిల్లపై సింహం కురిపిస్తున్న ప్రేమను ఫొటోగ్రాఫ్‌ గార్డన్‌ డొనోవాన్‌ తన కెమెరాలో బంధించారు.

సింహాల ఫొటోలు తీయడం తనకు ఇష్టమని గార్డన్‌ చెప్పారు. అందులో భాగంగా జింక పిల్లను చంపడానికి వస్తున్న సింహాన్ని చిత్రించడానికి తాను సిద్ధంగా ఉ‍న్నట్లు తెలిపారు. అయితే, తాను ఎదురుచూసిన దానికి భిన్నంగా సింహం జింక పిల్లను సంరక్షించడం ప్రారంభించిందని చెప్పారు. నమీబియాలోని ఈటోషా జాతీయ పార్కులో ఈ సింహం, జింక పిల్ల ఉన్నాయి.


 

Advertisement
 
Advertisement
Advertisement