Sakshi News home page

Kuno National Park: కునో నేషనల్‌ పార్కులోని 6 చీతాలకు రేడియో కాలర్ల తొలగింపు

Published Tue, Jul 25 2023 3:54 AM

Radio Collars of 6 Cheetahs removed for medical examination at Kuno National Park - Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్కు(కేఎన్‌పీ)లో ఉన్న చీతాల్లో ఆరింటికి రేడియో కాలర్లను తొలగించినట్లు అధికారులు సోమవారం తెలిపారు. కేఎన్‌పీ వైద్యులు, నమీబియా దక్షిణాఫ్రికాల నుంచి వచ్చిన నిపుణులు వీటి ఆరోగ్య పరిస్థితిపై పరిశీలన జరుపుతారని వెల్లడించారు. కేఎన్‌పీలో ప్రస్తుతం 11 చీతాలున్నాయి. ఈ ఏడాది మార్చి నుంచి  5 పెద్ద చీతాలు, 3 కూనలు చనిపోయిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం కేఎన్‌పీలో ఉన్న ఆరు చీతాల ఆరోగ్యాన్ని పరిశీలిస్తామని, మరో నాలుగు చీతాలకు ఏర్పాటు చేసిన రేడియో కాలర్లను కూడా తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. రేడియో కాలర్ల వల్లే చీతాలు మృతి చెంది ఉంటాయనే అనుమానాలున్నాయా అన్న ప్రశ్నకు.. అటువంటిదేమీ లేదని ఆ అధికారి అన్నారు.  ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసే అవసరమున్న చీతాలకు మాత్రమే రేడియో కాలర్లను తొలగిస్తున్నామని వివరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement