T20 World Cup 2022: శ్రీలంకకు బిగ్‌ షాకిచ్చిన నమీబియా.. 55 పరుగుల తేడాతో ఘన విజయం

T20 World Cup 2022: SL vs NAM Match Higligths and Updates - Sakshi

టీ20 వరల్డ్‌కప్‌-2022 రౌండ్‌-1లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో శ్రీలంకకు నమీబియా గట్టి షాకిచ్చింది. గీలాంగ్‌ వేదికగా జరిగిన ఈ ‍మ్యాచ్‌లో నమీబియా 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 108 పరుగులకే కుప్పకూలింది. నమీబియా బౌలర్లలో స్కోల్ట్జ్,షికోంగో, ఫ్రైలింక్, వైస్‌ తలా రెండు వికెట్లు సాధించారు.

శ్రీలంక బ్యాటర్లలో కెప్టెన్‌ శనక(29) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. నమీబియా బ్యాటర్లలో జాన్ ఫ్రైలింక్(43), జేజే స్మిత్‌(31) పరుగులతో రాణించారు. లంక బౌలర్లలో మధుషాన్‌ రెండు వికెట్లు, తీక్షణ, కరుణ రత్నే,చమీరా, హాసరంగా తలా వికెట్‌ సాధించారు.

పీకల్లోతు కష్టాల్లో శ్రీలంక
88 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి  శ్రీలంక పీకల్లోతు కష్టాల్లో పడింది. శ్రీలంక విజయానికి 36 బంతుల్లో 76 పరుగులు కావాలి.

ఐదో వికెట్‌ కోల్పోయిన శ్రీలంక
75 పరుగుల వద్ద శ్రీలంక ఐదో వికెట్‌ కోల్పోయింది. 20 పరుగులు చేసిన రాజపాక్స్‌..  బెర్నార్డ్ స్కోల్ట్జ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.

10 ఓవర్లకు శ్రీలంక స్కోర్‌: 72/4
10 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక 4 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. క్రీజులో భానుక రాజపాక్స(19), శనక(22) పరుగులతో ఉన్నారు.

వరుస క్రమంలో వికెట్లు ​కోల్పోయిన శ్రీలంక
శ్రీలంక వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. బెన్ షికోంగో వేసిన నాలుగో ఓవర్‌లో నిస్సాంక, గుణతిలక వరుస బంతుల్లో పెవిలియన్‌కు చేరారు. 4 ఓవర్లకు శ్రీలంక స్కోర్‌: 22/3

తొలి వికెట్‌ కోల్పోయిన శ్రీలంక
164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఆదిలోనే వికెట్‌ కోల్పోయింది. 6 పరుగులు చేసిన కుశాల్‌ మెండిస్‌.. డేవిడ్‌ వైస్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.

రాణించిన నమీబియా బ్యాటర్లు.. శ్రీలంక టార్గెట్‌ 163 పరుగులు
శ్రీలంకతో జరుగుతోన్న మ్యాచ్‌లో నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. నమీబియా బ్యాటర్లలో జాన్ ఫ్రైలింక్(43), జేజే స్మిత్‌(31) పరుగులతో రాణించారు. లంక బౌలర్లలో మధుషాన్‌ రెండు వికెట్లు, తీక్షణ, కరుణ రత్నే,చమీరా, హాసరంగా తలా వికెట్‌ సాధించారు.

15 ఓవర్లకు నమీబియా స్కోర్‌: 95/6
15 ఓవర్లు ముగిసే సరికి నమీబియా 6 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. క్రీజులో జాన్ ఫ్రైలింక్(14), జేజే స్మిత్‌(1) క్రీజులో ఉన్నారు.

10 ఓవర్లకు నమీబియా స్కోర్‌: 59/3
10 ఓవర్లు ముగిసే సరికి నమీబియా మూడు వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసింది. క్రీజులో గెర్హార్డ్ ఎరాస్మస్(11),స్టీఫన్ బార్డ్(15) పరుగులతో ఉన్నారు.

రెండో వికెట్‌ కోల్పోయిన నమీబియా
16 పరుగుల వద్ద నమీబియా రెండో వికెట్‌ కోల్పోయింది. 9 పరుగులు చేసిన దివాన్ లా కాక్.. ప్రమోద్‌ మధుషాన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 4 ఓవర్లకు నమీబియా స్కోర్‌: 24/2

తొలి వికెట్‌ కోల్పోయిన నమీబియా
3 పరుగుల వద్ద నమీబియా తొలి వికెట్‌ కోల్పోయింది. 3 పరుగులు చేసిన మైఖేల్ వాన్ లింగేన్.. చమీరా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.

టీ20 ప్రపంచకప్‌-2022కు రంగం సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్‌ రౌండ్‌-1(గ్రూప్‌-ఎ)లో భాగంగా తొలి మ్యాచ్‌లో గీలాంగ్‌ వేదికగా శ్రీలంక-నమిబీయా జట్లు తలపడుతోన్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన శ్రీలంక తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది.
తుది జట్లు
శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్‌ కీపర్‌), ధనంజయ డి సిల్వా, దనుష్క గుణతిలక, భానుక రాజపక్సే, దసున్ షనక(కెప్టెన్‌), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, ప్రమోద్‌ మధుషాన్‌, మహేశ్ తీక్షణ

నమీబియా: స్టీఫన్ బార్డ్, డేవిడ్ వైస్, గెర్హార్డ్ ఎరాస్మస్(కెప్టెన్‌), జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, జేజే స్మిట్, జాన్ ఫ్రైలింక్, జేన్ గ్రీన్(వికెట్‌ కీపర్‌), దివాన్ లా కాక్, మైఖేల్ వాన్ లింగేన్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, బెన్ షికోంగో

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top