చరిత్ర సృష్టించిన ఆడమ్‌ జంపా.. తొలి ఆసీస్‌ ప్లేయర్‌గా రికార్డు | T20 World Cup 2024: Adam Zampa Becomes First Australian Bowler To Achieve This Feat | Sakshi
Sakshi News home page

T20 WC: చరిత్ర సృష్టించిన ఆడమ్‌ జంపా.. తొలి ఆసీస్‌ ప్లేయర్‌గా రికార్డు

Published Wed, Jun 12 2024 5:53 PM | Last Updated on Wed, Jun 12 2024 6:29 PM

Adam Zampa Becomes First Australian Bowler To Achieve This Feat

టీ20 వరల్డ్‌కప్‌-2024లో ఆస్ట్రేలియా స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా అదరగొడుతున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం పసికూన నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో జంపా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. 

ఈ మ్యాచ్‌లో నమీబియా బ్యాటర్లను జంపా తన మయాజాలంతో ముప్పుతిప్పులు పెట్టాడు. జంపా తన 4 ఓవర్ల ​కోటాలో 12 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో జంపా ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్ల మైలు రాయిని అందుకున్న తొలి ఆస్ట్రేలియా బౌలర్‌గా జంపా రికార్డులకెక్కాడు. నమీబియా బ్యాటర​్‌ బెర్నార్డ్ స్కోల్ట్జ్‌ను అవుట్ చేయడంతో జంపా ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. 

టీ20ల్లో ఇప్పటివరకు 83 మ్యాచ్‌లు ఆడిన జంపా.. 100 వికెట్లు పడగొట్టాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన జంపా 8 వికెట్లు పడగొట్టాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. నమీబియాను 9 వికెట్ల తేడాతో ఆసీస్‌ చిత్తు చేసింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన నమీబియా 17 ఓవర్లలో కేవలం 72 పరుగులకే ఆలౌటైంది. అనంతరం 73 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్‌ కేవలం ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి 5.4 ఓవర్లలో ఛేదించింది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement